ఆంధ్రప్రదేశ్

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

14351

 

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

విశాఖపట్నం/బీచ్ రోడ్: జిల్లలో ఐదు ఆదర్శ పాఠశాలల్లో 2017-18 విద్య సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారు ఎం.వి. కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రావికమతం మండలం మారుపాక ఆదర్శ పాఠశాల, నర్శిపట్నం మండలం వేములపూడి ఆదర్శ పాఠశాల, చీడకాడ మండలం మంచలం తేగాడ ఆదర్శ పాఠశాల, మునగపాక మండలం సాటిపల్లి ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మర్చి 3వ తేది ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఐదో తగతి స్థాయి తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను సంప్రధించాలన్నారు. ప్రవేశ అర్హతలు  ఓసి, బీసి విద్యార్ధులు 01.09.2005 నుంచి 31.08.2007 మధ్య జన్మించి ఉండాలి, ఎస్సి, ఎస్టీ విద్యార్ధులకు రెండు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. జిల్లలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల్లో నిరవధికంగా 2015-16, 2016-17 విద్య సంవత్సరంలో చదివి ఉండాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కోసం www.crpap.gov.in/apmar.ap.gov.in లో సంప్రదించి, 04-02-2017లోగా వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్షా రుసుము: ఓసీ, బీసీలకు రూ . 100  ఏసీ,ఎస్టీలకు రూ. 50

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>