ఆంధ్రప్రదేశ్

కత్తితో బెదిరించి బంగారం అపహరణ

1805a54e2ecff44dbdbe7c598cb09536

 

కత్తితో బెదిరించి బంగారం అపహరణ

విశాఖపట్నం/సీతమ్మధార : ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి, బంగారం దోచుకెళ్ళిన ఘటన నాల్గో పట్టాన పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అక్కయ్యపలేనికి చెందిన పీ. ఆనంద్ కుమార్ ఆదివారం అర్ధరాత్రి రైల్వే స్టేషన్ నుంచి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా. ప్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి వాహానం ఆగిపోయింది. ఆ సమయంలో అక్కడ మద్యం సేవిస్తున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇది గమనించారు. సాయం చేస్తామని చెప్పి వాహనాన్ని కొంత దురం తోసి కత్తితో అతన్ని బెదిరించారు. మేడలో ఉన్న బంగారాన్ని లాక్కొని అక్కడి నుంచి ఉడాయించారు. వెంటనే బాధితుడు నాల్గో పట్టాన పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. క్రైమ్ ఎస్ఐ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>