ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు,

విశాఖపట్నం విమానాశ్రయకి హై సెక్యురిటీ

bhadrainternational_countersatairport

 

విశాఖపట్నం : విశాఖ విమనాశ్రయంలో ఆదివారం సిఐఎస్ఎఫ్  అధికారులు, పొలిసు అధికారులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందన్న ప్రచారం నేపధ్యంలో సహాయ పొలిసు కమిషనర్ బీమరావు అధ్వర్యంలో భారీ భద్రత చర్యలు చేపట్టారు. ఇక్కడ నిఘా అధికారులు. సిబ్బంది డేగ కళ్లుతో పరిశీలించారు. సిసి కెమెరాలతో ను పలువురికదలికలను కనిపెడుతున్నారు. హై సెక్యురిటి ఏర్పాటు చేశామని, అడుగడుగునా నిఘాపెంచామని భీమారావు తెలిపారు.

సందర్శకుల టికెట్లు నిలిపివేతపై వివాదం : విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సందర్శకుల టికెట్లు నిలిపివేశారు. వీరిలో చాల మంది స్థానిక నాయకులూ ఉన్నారు. టికెట్లు తీసుకున్న అనుమతించకపోవడం పై టికెట్ విక్రయాలు జరిపే కాంట్రాక్టరుని సందర్శకులతో కలిసి ప్రశ్నించారు. వీరిని అనుమతించనపుడు మాకు కాంట్రాక్టు ఇవ్వడం దేనికని కాంట్రాక్ట్ ఋ ఎయిర్ పోర్టు అధికారులపై మండిపడ్డారు. తను డిపాజిట్ గా రూ. 50 లక్షలు, నెలనెలా రూ.9.50 లక్షలు చెల్లిస్తున్న ఇలాంటి చర్యలతో నష్టపోతున్నానని ఆవేదన చెందరు. దీనిపై కాంట్రాక్ట్ ఋ విమానాశ్రయ డైరెక్టర్ వినోద్కుమార్ శర్మకు పోన్లో వివరించారు. దీంతో టికెట్లు తీసుకున్న వారిని అనుమతించారు. తర్వాత నుంచి టికెట్లు నిలిపివేశారు. అయితే భద్రత కారణాల నేపధ్యంలో నిఘా వర్గాల హెచ్చరికల వాళ్ళ ఇలాంటి చర్యలు చేపట్టామని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>