ఆంధ్రప్రదేశ్,

రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం

cbn-exp

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం సోమవారం (31న) విజయవాడలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన కార్యాలయంలో భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏపీ సచివాలయ భవనాలను తనకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ, పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి, పేదలకు గృహ నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా.. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణపై చర్చించేందుకు రెవెన్యూ శాఖను చూసే ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నవంబరు 2న వెలగపూడి సచివాలయంలో సమావేశం కానుంది.

విశాఖ జిల్లాతోపాటు పలుచోట్ల పేదలు ఆక్రమించుకున్న 100 గజాలను ఉచితంగా, ఆపై ఉన్న భూమిని మార్కెట్‌ ధర ఆధారంగా క్రమబద్ధీకరించాలని ఉపసంఘం లోగడ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టు 12న ప్రభుత్వం జీవో 296ను విడుదల చేసింది. అలాగే పెద్దలు ఆక్రమించుకున్న భూములు 500 గజాల వరకు ఉంటే ఎలా క్రమబద్ధీకరించాలో సూచిస్తూ ఈ ఏడాది మార్చి 30న జీవో 118 విడుదల చేసింది. పేదలు ఆక్రమించుకున్న భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.

అయితే కొందరు పెద్దలు 100 నుంచి 500 గజాలపైనే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. వాటి క్రమబద్ధీకరణ విషయంలో ఎలాంటి విధానం అనుసరించాలో 2న జరిగే భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>