ఆంధ్రప్రదేశ్

కాకినాడ లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఫాన్స్

 
‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ పేరిట భారీ బహిరంగ సభకు టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్… తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారీ ఏర్పాట్లే చేశారు. ఈ సభ కోసం నిన్న రాత్రికే ఆయన కాకినాడ చేరుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆయన బస చేశారు. ఇక నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభ నేపథ్యంలో అప్పుడే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి. నిన్న సాయంత్రం నుంచి రాష్ట్రంలోని నలుమూలల నుంచి పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో కాకినాడకు తరలివచ్చారు. నేటి ఉదయం తెల్లవారకముందే పెద్ద సంఖ్యలో అభిమానులు పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ జనసందోహం నెలకొంది.కాకినాడలో నేటి సాయంత్రం 4 గంటలకు జరగనున్న హీరో పవన్ కల్యాణ్ సీమాంధ్ర ఆత్మగౌరవ సభకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ధర్మపురి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన యువత ఇప్పటికే కాకినాడలోని జేఎన్టీయూ మైదానానికి చేరుకుంది. తామంతా పవన్ వీరాభిమానులమని, ఆయనేం మాట్లాడతారో వినేందుకే వచ్చామని వీరంతా చెబుతున్నారు. మరోవైపు సభకు ఇంకా ఆరు గంటల సమయం ఉన్నప్పటికీ, వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఈ సభకు మూడంచెల బారికేడ్లు, భద్రతను ఏర్పాటు చేసిన పోలీసు వర్గాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా నగరమంతా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>