ఆంధ్రప్రదేశ్

విజయవాడ లో భారీ అగ్ని ప్రమాదం

కృష్ణాజిల్లా నిడమానూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ తెల్లవారుజామున బెస్ట్‌ప్రైజ్ సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. మంటలు మార్కెట్ మొత్తం వ్యాపించడంతో అందులోని సరుకులు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒకరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండడంతో అదుపులోకి తేవడం కష్టతరంగా మారింది. మాల్ నుంచి పేలుడు శబ్దాలు వినిపిస్తుండడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మాల్‌గా చెప్పుకుంటున్న బెస్ట్‌ప్రైజ్‌ మంటలకు పూర్తిగా ఆహుతైంది. విజయవాడలో ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరగడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>