Breaking News, ఆంధ్రప్రదేశ్

అమెజాన్ సంస్థ తీరుపై కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహం

15940456_1348116915250381_7218220663714223882_n

 

అమెజాన్ సంస్థ తీరుపై కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహం

తమ ఆన్‌లైన్ షాపింగ్ ఉత్పత్తుల్లో భారతీయులను అవమానించేలా వస్తువులను విక్రయిస్తున్నారని ఇది వారికి తగదన్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే అమెజాన్ సంస్థ ఉద్యోగులకు వీసా ఇచ్చే ప్రసక్తేలేదని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన అమెజాన్ తమ వెబ్ పోర్టల్ నుంచి ఆ ప్రొడక్ట్స్ ను తొలగించిందని సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. కెనడాలోని భారత హైకమిషన్ తమ సంస్థపై చర్యలు తీసుకోకముందే తప్పిదాన్ని గుర్తించి ఆ ఉత్పత్తుల వివరాలను రిమూవ్ చేసినట్లు వివరించారు.

విషయం ఏంటంటే.. అమెజాన్ సంస్థ కెనడా విభాగం భారత జాతీయ పతాకాన్ని డోర్ మ్యాట్స్ పై ప్రింట్ చేసి ఆన్ లైన్‌ విక్రయాలు చేస్తోంది. ఈ విషయాన్ని అటుల్ భోబ్ అనే ట్విట్టర్ యూజర్ కేంద్రమంత్రి సుష్మా దృష్టికి తీసుకెళ్లారు. త్రివర్ణ పతాకాన్ని అవమానిస్తున్న ఆమెజాన్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ట్విట్లర్ ద్వారా సుష్మా స్వరాజ్‌ను కోరారు. అమెజాన్ చర్యలపై స్పందించిన మంత్రి సుష్మా.. ఆ సంస్థ భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమై జాతీయ పతాకాన్ని అవమానించేలా ఉన్న ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే అమెజాన్ ఉద్యోగులు, అధికారులకు భారత్ వీసా ఇచ్చే ప్రసక్తేలేదని గట్టిగా హెచ్చరించారు.

గతేడాది ఆగస్టులో హిందూ దేవుళ్ల ఫొటోలను ప్రింట్ చేసిన డోర్ మ్యాట్స్ ను ఆన్‌లైన్లో విక్రయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సంస్థ ఈ ఉత్పత్తులను తమ వెబ్ పోర్టల్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అమెజాన్ వివాదంలో చిక్కుకుంది. కెనడాలోని భారత హైకమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి సుష్మా హెచ్చరికల నేపథ్యంలో అమెజాన్ తమ తప్పిదాన్ని గుర్తించి.. వెబ్ సైట్లో భారత జాతీయ పతాకాన్ని చిత్రించిన డోర్ మ్యాట్స్ ప్రొడక్ట్స్ ను పూర్తిగా తొలగించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>