Breaking News, దేశ అబివ్రుద్ది పధకాలు, పార్లమెంటు & దేశ రాజకీయలు

ఆ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం పని చేస్తా: మోదీ

5

 

ఆ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం పని చేస్తా: మోదీ

ముందస్తు బడ్జెట్‌తో ప్రయోజనాలెన్నో

న్యూఢిల్లీ: ముందస్తు బడ్జెట్‌తో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే వివిధ రంగాలు నిధు లు అందుకునే అవకాశం ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. నీతి ఆయోగ్‌ సదస్సులో ఆర్థికవేత్తల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ… దేశ వాస్తవ ఆర్థిక వ్యవస్థపై బడ్జెట్‌ సమర్పణ తేదీల మార్పు ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ కాలవ్యవధి వల్ల తొలకరికి ముందు ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని చెప్పారు. వ్యక్తిగత, కార్పొరేట్‌ ఆదాయపు పన్ను రేట్ల సరళీకరణతోపాటు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా కస్టమ్స్‌ పన్ను ల్లో మార్పుల్ని ఆర్థికవేత్తలు సూచించారని నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పనగరియా అన్నారు.

‘‘నేను కొట్టిన దెబ్బకు నల్లకుబేరులు విలవిల్లాడుతున్నారు.

నేరుగా దొంగల ముఠా నాయకుడినే గురిచూసి కొట్టాను. తగలాల్సిన వారికే దెబ్బ తగిలింది కాబట్టి నా నిర్ణయం కొందరికి రుచించడం లేదు’’.. అంటూ పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు. నల్లధనం, తీవ్రవాదులకు నిధులు, మనుషుల అక్రమ రవాణా, మాఫియా.. లాంటి వ్యవస్థలన్నీ ఒకే దెబ్బకు ధ్వంసమయ్యాయన్నారు. మోదీ ప్రభుత్వం పెద్ద కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపణల్ని ఖండించారు. తమది పేదల ప్రభుత్వమన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో భాజపా పరివర్తన్‌ మహార్యాలీని ఉద్దేశించి మోదీ మంగళవారం నాడిక్కడ ప్రసంగించారు. 900 కిలోమీటర్ల ఛార్‌ధామ్‌ హైవే అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిపై విరుచుకుపడ్డారు.

బీరువా అరల్లో, పరుపుల కింద మూలుగుతున్న నల్లధనం పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకులకు వస్తోంది. ప్రజలకు చేరుతోంది. నల్లధనాన్ని, దేశాన్ని నాశనం చేసిన నల్లకుబేరుల్ని దేశం నుంచి తరిమికొట్టడం కోసం కాపలాదారుడి బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తున్నా. అవినీతి కొందరికి రక్తంలోనే ఉంది. అందుకే నల్లడబ్బును తెల్లధనంగా మార్చుకోవడానికి అడ్డదార్లు తొక్కుతున్నారు. దానిని నేను చూడట్లేదనుకుంటున్నారు. కానీ మాకు అన్నీ తెలుసు. కాబట్టే వారు అధికారులకు పట్టుబడిపోతున్నారు.

మకిలిని శుభ్రంచేస్తున్నాం

ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన మకిలిని నోట్ల రద్దు ద్వారా శుభ్రం చేస్తున్నాం. ప్రజలకు సాధికారత కల్పించి, సమున్నత భవిష్యత్తును ఇవ్వాల్సి ఉంది. నిజాయితీపరులకు సాధికారత కల్పించడం కోసమే నేను ఈ పోరాటం చేస్తున్నా. కేవలం ప్రారంభ కార్యక్రమాల రిబ్బన్లు కత్తిరించడం, జ్యోతులు వెలిగించడం కోసమా నాకు మీరు 2014లో భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టింది? అవినీతిని అంతం చేయడం కోసం కాదా ఓట్లేసింది? మన శక్తులన్నీ ఒడ్డి ఈ చెడును తరిమికొట్టాల్సిన బాధ్యత మనకు లేదా? ..అందుకే ఈ పోరాటం. ఈ సంధి సమయంలో నాకు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు.

తమ ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తోందన్నారు. ధనవంతులు, కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ పని చస్తున్నారన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ పరివర్తన్‌ మహార్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నోట్ల రద్దు అనే ఒకే ఒక్క నిర్ణయంతో నల్లధనం, ఉగ్రవా దులకు నిధులు అందకుండా చేయడంతో పాటు మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలను అడ్డుకున్నా మని చెప్పారు. కొంత మంది తన నిర్ణయంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారని, దొంగల నాయకులను తాము అడ్డుకోవడమే దీనికి కారణమని నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో 18 వేల గ్రామాల ప్రజలు విద్యుత్‌ లేకుండానే జీవించేవారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 12 వేల గ్రామాలకు విద్యుత్‌ అందించామని, మరో ఆరు వేల గ్రామాలకు విద్యుత్‌ను అందించే చర్యలు తీసుకుంటున్నామని, ఇది ధనవంతుల కోసం చేస్తున్న పనా? లేక పేదల కోసం చేస్తున్న కృషా? అని ప్రశ్నించారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో ఇప్పటి వరకూ కప్‌బోర్డ్స్, పరుపుల కింద దాచిన నల్లధనం బ్యాంకులకు చేరుకుంటోందని చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీసే విషయంలో చౌకీదార్‌(వాచ్‌మన్‌)గా తన పని తాను చేశానని చెప్పారు.

వారి రక్తంలోనే అవినీతి ఉంది

‘‘కొంత మంది రక్తంలోనే అవినీతి ఉంటుంది. వారు నల్లధనాన్ని మార్చుకునేందుకు దొడ్డిదారిని ఉపయోగిస్తున్నారు. ఇదంతా మోదీకి కనిపించదని వారు భావిస్తున్నారు. కానీ వారేం చేస్తున్నారనేది మాకు తెలుసు. ఇప్పుడు వారంతా పట్టుబడతారు’’ అని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా చేస్తున్న దాడులను మోదీ ప్రస్తావించారు. నోట్ల రద్దు అంశాన్ని ప్రధాని మోదీ ఒక క్లీన్‌నెస్‌ డ్రైవ్‌ (పరిశుభ్రతా కార్యక్రమం)గా అభివర్ణించారు. దీనికి మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు, వారికి మంచి భవిష్యత్తును అందజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలోని నిజాయితీపరుల సాధికారత కోసం.. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా ప్రారంభించిన పోరాటానికి తొలి అడుగుగా నవంబర్‌ 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు

గురిచూసి కొట్టా నోట్ల రద్దు ఒక క్లీన్‌నెస్‌ డ్రైవ్‌.. దీంతో నల్లధనం, ఉగ్ర నిధులు, మానవ, మాదక  తగలాల్సిన వారికే దెబ్బ తగిలింది  ఒకే దెబ్బకు పలు పిట్టలు నేల రాలాయి

నల్ల కుబేరుల్ని తరిమేసే కాపలాదారుడిగా పని చేస్తున్నా  నిజాయతీపరులకు సాధికారితే లక్ష్యం  మాది పేదల ప్రభుత్వం  ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటన  – ధనవంతుల కోసం కాదు.. పేదల కోసమే పనిచేస్తున్నాం – ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>