Breaking News, ఆంధ్రప్రదేశ్

ఇక పించన్లు బ్యాంకుల ద్వారా చెల్లింపు

998

 

విశాఖపట్నం/ భీమునిపట్నం :  భీమిలి జోన్ పరిధిలో డిసెంబర్ నుంచి పించన్లు పంపిణి బ్యాంకుల ఖాతాల ద్వారా చేయనున్నట్టు పట్టాన సామజిక అభివృద్ధి అధికారి భి. శ్రీనివాసరావు తెలిపారు ఇక్కడ పరిధిలో వికలాంగులు, విధంతువులు, వృద్ధులతోపాటు అభయహస్తం, కల్లుగీతం కార్మికులు, చేనేత కార్మికులతో కలిపి మొత్తం 4008 మంది పించన్లు పొందుతున్నారని అన్నారు. ఇందులో వృద్ధులు 1,438 మంది, వింతతువులు 1,867, వికలాంగులు 563మ అభయహస్తం 100 మంది, కలుగీత కార్మికులు 33, చేనేత కార్మికులు 7 మంది ఉన్నారని తెలిపారు. ప్రతినెల సిబ్బంది ఆయా వారులకు వెళ్లి లబ్దిదారులకు పించన్లు అందించేవారిని ఇకపై బ్యాంకుల నుంచి తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్న వారు దానికి తప్పని సరిగా అధర్ నెంబర్ ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు లేని 1,108 మందితో డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్లు, సిబ్బంది కొత్త  ఖాతాలను తెరవడానికి సహకారం అందిస్తారని చెప్పారు. నడిచిరాలేని వారు ఇక్కడ పరిధిలో సుమారు 300 మంది వరకు ఉంటారని వారికి పించన్లు ఇబ్బందులు పడకుండా అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర వివరాల కోసం కార్యాలయానికి వచ్చి తమను సంప్రదించాలని కోరారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>