Breaking News, ఆంధ్రప్రదేశ్

ఇప్పటికి రూ4 లక్షల 10వెల కోట్ల నల్లదనం గుర్తింపు : ఐటి శాఖ

income-tax

 

ఇప్పటికి రూ4 లక్షల 10వెల కోట్ల నల్లదనం గుర్తింపు : ఐటి శాఖ

నోట్లు రద్దు తర్వాత డిపాజిట్లపై అంచనాకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ల్లో డిపాజిట్లపై విశ్లేషణ .. అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి, సంబందితి ఖాతాదారులకు నోటిసులివ్వాలని ఐటి శాఖ ఆదేశం 60 లక్షలకు పైగా అకౌంట్లలో రూ. 2 లక్షలకు పైగా నగదు డిపాజిట్ అయినట్లు గుర్తింపు, సహకార బ్యాంకుల్లో రూ. 16వేల కోట్ల డిపాజిట్ జాతియం/న్యూ ఢిల్లీ :- పెద్ద నోట్ల రద్దు తర్వాత బయటకొచ్చిన నల్లదనం ఎంత .? నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన లక్షల కోట్ల రూపాయల్లో బ్లాక్ మనీ ఎంత మొత్తంలో ఉంది.? ఇది దాదాపు రూ.3.50 లక్షల కోట్ల నుండి 4.10 లక్షల కోట్ల వరకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం బావిస్తుంది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన ఈ సొమ్ముపై నల్లబబులు పన్ను కట్ట లేదని ఓ అంచనాకు వచ్చింది. దీంతో ఈ రూ. 4 లక్షల కోట్ల డిపాజిట్లకు సంబంధించిన ఖతధారులందరిపై దృష్టి సారిస్తుంది. ఆ లావాదేవీలను క్ష్నున్నంగా పరిశీలించాలని, అనుమానాస్పదంగా ఉంటె సంబంధిత ఖాతాదారులకు నోటిసులు పంపాలని ఐటిశాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకుల్లో జమాయిన పన్ను ఎగవేత ఆదాయంపై ఇప్పటికే తమవద్ద పక్క సమాచారం ఉందని.. ఆ వివరాలను విశ్లేస్తున్నామని కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రూ.2 లక్షలకు పైగా నగదు డిపాజిట్ అయిన ఖాతాలు 60 లక్షలకు పైగా ఉన్నట్లు గుర్తించం. ఈ ఖాతాల్లో రూ. 7.34 లక్షల కోట్ల నగదు జమ అయింది అని అయన వివరించారు నవంబర్ 9 తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.10.700 కోట్ల నగదు డిఫాజిట్ చేశారు. అలాగే సహకార బ్యాంకులలో రూ.16 వేల కోట్ల మేర ఖాతాల్లోకి నగదు చేరింది. వాటిపై ఆదాయపన్ను శాఖ, ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ విచారణ కొనసాగిస్తుంది. మరోవైపు చాల రోజులుగా లావాదేవీలు జరగని కొన్ని ఖాతాలను మళ్ళి యక్టీవెట్ చేసి రూ.25 వేల కోట్ల మేర డిపాజిట్ చేసినట్లు గుర్తించం అని తెలిపారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>