Breaking News, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు

ఎస్‌.రాయవరం మండలం గోకుపాడు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

d70dd16c-1dc3-46da-ac39-592645e88804

 

ఎస్‌.రాయవరం మండలం గోకుపాడు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

 

ఎస్‌.రాయవరం మండలం గోకుపాడు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్క, తమ్ముడు సహా నలుగురు వ్యక్తులు మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ హయత్‌ నగర్‌లో నివసిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన 11మంది విశాఖ బంధువుల ఇంటికి వచ్చారు. వారు విశాఖ నుంచి స్కార్పియోలో అన్నవరం వెళుతుండగా గోకుపాడు జంక్షన్‌ దాటిన తరువాత కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపైకి దూసుకుపోయింది.  స్కార్పియోలో ప్రయాణిస్తున్న రూప (45), రాజేష్‌ (40) అక్కడిక్కడే మృతి చెందగా సుభోసింగ్‌ (18) ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఇదే కారులో ఉన్న ఏడాది చిన్నారి శ్రామేలికి, నేహా సింగ్, గీతా సింగ్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో 16 ఏళ్ల వయస్సులోపు వయసున్న యహోసింగ్, రిషి సింగ్, అభిషేక్, మరో మహిళ బిందుప్రియ, బండి నడుపుతున్న అభిజీత్‌లకు గాయాలయ్యాయి.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>