Breaking News, ఆంధ్రప్రదేశ్

ఏసీబీకి రెండో సారి చిక్కిన అచ్యుతాపురం తాహసీల్దార్

11

 

ఏసీబీకి రెండో సారి చిక్కిన అచ్యుతాపురం తాహసీల్దార్

విశాఖపట్నం/గాజువాక : అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుపడ్డ అచ్యుతాపురం తాహసీల్దార్ రామచంద్రరావు తొలినుంచీ అవినీతి బాటలోనే పయనిస్తున్నారు. ఇందుకు తను పనిచేసే చోట్ల ప్రైవేట్ సహాయకులను ఏర్పాటు చేసుకొని అక్రమ సంపాదన పోగేసుకునేవారు. గాజువాక డిప్యూటీ తాహసీల్దార్ గా పని చేసిన ఆయన ఏసీబీకి 2010లో పట్టుబడ్డారు. ఏ ఫైలుకైనా తను డిమాండ్ చేసినంత మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఆ పనిని తిరస్కరించే పరిస్థితి అని అప్పట్లో చెప్పుకునేవారు. ఆ కేసు నుంచి ఎలాగోలా బయటపడి తాహసీల్దార్ పదోన్నత  పొందిన తరువాత కూడా మళ్ళీ లంచం కేసులో పట్టుబదతమతని తీరుకు అద్దం పడుతుంది. విశాఖ డివిజన్లో భాధ్యతలు నిర్వహిస్తుండగా రెండు నెలల క్రితం అచ్యుతాపురం బదిలీపై వచ్చారు. పెండింగ్ ఫైళ్ళపై దృష్టి సారించి అక్రమాలకూ అవకాశాలను వెదికారు. ఇందులో భాగంగా మంగళవారం ఏసీబీ అధికారులకు మరోసారి చిక్కారు. ఏసీబీ దీఎస్పి రామకృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అచ్యుతాపురం తాహసీల్దార్ కార్యాలయంలో రాత్రి 7 గంటల సమయంలో విశాఖకు చెందిన ఎల్. విశ్వనాధం రెడ్డి నుంచి రూ. 4 లక్షల నగదు, 3.5 లక్షలు విలువైన చెక్కులను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తాహసీల్దార్ చాంబర్ లోకి ప్రవేశించారు. వారికి చూసి అసిస్టెంట్ సర్వేయర్ సత్తిబాబు పరుగందుకున్నాడు. వెంబడించి పట్టుకొని అతని వద్ద ఉన్న నగదు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్ ఈ. రామచంద్రరావు. టి. వెంకటరమణ, సర్వేయర్ అసిస్టెంట్ లాలం సత్తిబాబులపై కేసునమోదు చేశారు. మండలంలోని అవసోమవారంలో సర్వే నెంబర్ 100,36,90లో గల ప్రభుత్వ భూమిని జిరయితీగా మర్చి అన్ లైన్లో నమోదుకు 8.5 లక్షల లంచం అడిగారు. ముందుగానే రూ. లక్ష అడ్వాన్సుగా తేసుకున్నారు. ఈ నేపధ్యంలో విశ్వనాధంరెడ్డి ఎసీబీని ఆశ్రయించాడు. మంగళవారం దాడిచేసి లంచంతీసుకుంటుండగా పట్టుకున్నారు. విశ్వనధంరెడ్డి అవసోమవారంలో అనాదీనం ప్రభుత్వం భూములను కొనుగోలు చేశారు. అన్ లైన్ లో సబ్ డివిజన్ ను, మార్పిడిచేసి జిరాయితీగా నమోదుకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తాహసీల్దార్ ప్రసాద్ రికార్డులను మార్చడానికి అంగీకరించలేదు, ఫైలు పెండింగ్లో ఉంది. రెండు నెలల క్రితం రామచంద్రరావు తాహసీల్దార్ భాధ్యతలు తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న ఫైళ్ళను పరిశీలించి సర్వేయర్ అసిస్టెంట్ లాలం సత్తిబాబు ద్వారా విశ్వనధంరేడ్డికి సమాచారం పంపాడు. గత డిసెంబర్ 27న విశ్వనాధం తాహసీల్దార్ను కలిసి డీల్ మాట్లాడాడు. 8.5 లక్షలు డిమాండ్ చేశారు. అదేనెల 30న డీల్ ఖయపరుచుకొని రూ. లక్ష అడ్వాన్స్ గా ఇచ్చారు. అన్ లైన్ నమోదులో మార్పులు చ్ర్పులు చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపాల్సిన నమునాను తయారుచేసి ఫైల్ ను ఈ నెల 7న తాహసీల్దార్ రామచంద్రరావు తన మెయిల్ అడ్రెస్ నుంచి విశ్వనాధంరెడ్డికి మెయిల్ చేశాడు. తనకు నాలుగు లక్షలు చెక్కుల రూపంలో కావాలని చెప్పాడు. అంత నగదు ఇవ్వలేమని విశ్వనధంరేద్ది బెరమదాడు. అందుకు రామ చంద్రరావు అంగీకరించలేదు. విశ్వనాదం రెడ్డి ఈ నెల 9న ఎసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు మంగళవారం కేసు నమోదు చేసి అనుకున్నట్టుగా పౌడెర్ అద్దిన రెండు వేల రూపాయల నోట్లు, ఐఎన్జీ వైశ్య బ్యాంకులో చెల్లుబాటు అయ్యల మూడు చెక్కులను విశ్వనంధం రెడ్డి మంగళవారం రాత్రి 7 గంటలకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు తాహసీల్దార్ రామచంద్రరావు,సత్తిబబులపై కేసునమోదు చేసినట్టు ఏసీబీ దీఎస్పి రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది రమణమూర్తి, గణేష్, రమేష్ పాల్గొన్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>