Breaking News,

కాన్పుర్ సమీపంలో ఉదయం రైలు ప్రమాదం

27

 

కాన్పుర్ సమీపంలో ఉదయం రైలు ప్రమాదం

కాన్పురుకు 50 కిలోమీటర్ల దూరంలో రురా-మెథా మార్గం మధ్యలో సెల్దా-అజ్మీర్ ఎక్స్ ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో  ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా, ట్రెయిన్ గార్డ్ సహా దాదాపు 26 మంది ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సెల్దా-అజ్మీర్ ఎక్స్ ప్రెస్ రైలు 12988 ప్రమాదానికి గురైన విషయం తెలియగానే సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వల్ల ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై రైల్వేమంత్రి సురేష్ ప్రభు విచారణకు అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

కాన్పుర్: 0512 – 2323015, 2323016, 2323018
అలహాబాద్: 0532-2408149, 2408128, 2407353

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>