Breaking News, తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండున్నరేళ్లలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం కింద 2.66 లక్షల ఇళ్లు

29

 

కేంద్ర ప్రభుత్వ సహకారంతో  రెండున్నరేళ్లలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం కింద 2.66 లక్షల ఇళ్లు

రాబోయే రెండున్నరేళ్లలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం కింద 2.66 లక్షల ఇళ్లు కట్టితీరుతామని, ఇందుకు కేంద్రం సహాయం కూడా తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టకుండ ఎన్నికలకు వెళ్తే ఫలితం ఎలా ఉంటుందో తమకు తెలుసునని చెప్పారు. ఆ 2.60 లక్షల ఇళ్లు కడితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేయదని, కేసీఆర్‌ను సీఎంగా ఏకగ్రీవంగా ప్రకటిస్తామని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన సవాల్‌కు ముఖ్యమంత్రి దీటుగా స్పందించారు. వెంకట్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం పేదల గృహాలకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి గ్రామీణ గృహ నిర్మాణ యోజన పథకం కింద ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు ఇస్తుంది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.50 లక్షలు కలిపి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తాం. ప్రత్యేకంగా తెలంగాణ కోసం ప్రధానమంత్రి గ్రామీణ గృహ నిర్మాణ యోజనలో నిబంధనలు మార్చారు. కేంద్రం చేసిన సాయంతో 2.66 లక్షల ఇళ్లే కాదు.. ఇంకా ఎక్కువగానే కడతాం’’అని సీఎం వివరించారు. పథకంలో కొన్ని నిబంధనలు కూడా సడలిస్తామని చెప్పారు. ఇళ్లు నిర్మించే కాంట్రాక్టర్లు 7 శాతం డిపాజిట్‌ను ప్రభుత్వం వద్ద పెట్టాలన్న నిబంధన సడలింపుపై ఆలోచన చేస్తామన్నారు. ప్రభుత్వ ఇసుక డిపోల ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రకటించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>