Breaking News,

గుజరాత్లో పోలీసులు జరిపిన సెర్చ్ ఆపరేషన్‑లో నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్‑ సీజ్

fake-currency-notes-seized-in-rajkot_e3cdc10e-cd2d-11e6-b3cb-dcd306bf19b8

 

గుజరాత్లో పోలీసులు జరిపిన సెర్చ్ ఆపరేషన్‑లో నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్‑ సీజ్

ఖేడా జిల్లాలో గుజరాత్ పోలీసులు జరిపిన సెర్చ్ ఆపరేషన్‑లో నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్‑ను బయటపడింది. ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12.45 లక్షల నగదును పోలీసులు  స్వాధీనం చేసుకోగా, వాటిలో ఎక్కువగా కొత్త రూ.2000 నోట్లే ఉన్నాయి. రాజ్‑కోట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బోపాల్ ప్రాంతంలోని బంగళాలో జరిపిన సెర్చ్ ఆపరేషన్‑లో వీరు పట్టుబడ్డారు. హనుమాన్‑మధీ సమీపంలో రెండు రోజుల క్రితం రూ.2000, రూ.500 నోట్లతో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల్లో ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్‑ను చేపట్టారు. దీనిలో ఒక మిషన్‑ను ఓ కారులోంచి రికవరీ చేయగా.. మరో మిషన్‑ బంగళాలో జరిపిన సెర్చ్ ఆపరేషన్‑లో పట్టుబడింది. ఈ గ్యాంగ్ అహ్మదాబాద్‑కు చెందిందని పోలీసులు చెప్పారు.  వీరు కమిషన్‑పై నోట్లను మార్పిడి చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం వీరిపై దర్యాప్తు చేపడుతున్నామని, వీరి నుంచి నకిలీ నోట్ల ముఠాల సమాచారం సేకరిస్తామన్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>