Breaking News, ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఎమ్మెల్యే గోవింద .. అంతులేని భుదందా .. ఓ ఇంటి ప్రహరీని కూలగొట్టి చంపుతామని బెదిరింపులు

untitled-1-copy

 

ఎమ్మెల్యే గోవింద .. అంతులేని భుదందా ..  ఓ ఇంటి ప్రహరీని కూలగొట్టి చంపుతామని బెదిరింపులు

విశాఖపట్నం/అనకాపల్లి : టీడీపీ ఎమ్మెల్యే ఫీలా గోవింద సత్యనారాయణపై పెందుర్తి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. భూ దురాక్రమణకు యత్నం, చంపుతామని బెదిరింపులు, తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, భాదితులు (ఫిర్యాదు ద్వారా) వెల్లడించిన కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఎంవీపీ కాలనీలో నివాసం దాదాపు 25 ఏళ్ళ క్రితం పెందుర్తిలో స్థలం కొనుగోలు చేశారు. అందులో ఇల్లు కట్టుకుని ఓ పోర్షన్లో రమాదేవి కుటుంబం ఉంటోంది. మరోకటి అద్దెకు ఇచ్చారు. రమాదేవి భర్త సత్యనారాయణ గత నవంబర్ మరణించారు. ఉపాధి నిమిత్తం రమాదేవి కుమారుడు రాజేష్ బాబు మస్కట్ లో ఉంటున్నారు. గత డిసెంబర్ లో ఎమ్మెల్యే ఫీలా గోవింద సత్యనారాయణ, అతని కుమారుడు శ్రీకాంత్ పీఏ రమేష్ తో, పాటు అతని అనుచరులు ఆ ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యానికి దిగారు. తక్షణమే ఇల్లు ఖాళీ చేసితమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇల్లు ఖాళీ చేయని పక్షంలో రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అంత సొమ్ము మేమెందుకు ఇవ్వాలని రమాదేవి కుంటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఈ క్రమంలో రోజు ఎమ్మెల్యే అనుచరులు వీరిని బెదిరించడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో ఇంటి యజమాని రమాదేవికి పక్షవాతం రావడం, వీరి బెదిరింపులు ఎక్కువడంతో వారి పోర్షన్ ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళిపోయారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే, అతని అనుచరులు జేసీబీల సహాయంతో రమాదేవి ఇంటి గోడ పక్కన కూడా దాదాపు నాలుగు అడుగుల లోతి మట్టితీశారు. దీంతో ఆందోళనకు గురైన రమాదేవి కుంటుంబం సభ్యులు జిల్లా రెండవ అదనపు సీనియర్ సివిల్ కోర్టులో కేసు వేయగా డిసెంబర్ 23న రమాదేవికి అనుకూలంగా జడ్జి స్టేటస్ కో ఇచ్చారు. అయితే ఈ నెల 5న అర్ధ రాత్రి 2 గంటలకు జేసీబీల సహాయంతో దాదాపు 15 మంది వ్యక్తులు వచ్చి రమాదేవి ఇంటి ముందు రోడ్డును ఇంటి ప్రహరీని తవ్వించేశారు.  ఇంటి గోడలను పడగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అదే ఇంటిలో అద్దెకు ఉన్నవారు పెద్దగా కేకలు వేయగా ఇంటిపై దాడికి పాల్పడిన వారు జేసీబీ సహకార్లతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై రమాదేవి కోడలు ముమ్మన హారిక (రాజేష్ బాబు భార్య) పెందుర్తి పోలిస్ స్టేషన్లో ఎమ్మెల్యే పీలా గోవింద సహా అతని కుమారుడు శ్రీకాంత్, ప్రైవేట్ పీఏ రమేష పై ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఎమ్మెల్యేపై ఐపీసీ 447, 427, 506 ఆర్/డబ్ల్యు 34 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పెందుర్తి సీఐ జే.మురళి వెల్లడించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>