Breaking News, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ, దేశ అబివ్రుద్ది పధకాలు,

ప్రభుత్వం తన సొంత స్థలానికి తనే అద్దె చెల్లిస్తు టీడీపీ నాయకునికి పోషిస్తుంది

09

 

 

సర్కారు స్థలం దొరకాలేదు అని అధికారుల లాజిక్కు.

ఐఎంఎఫ్ఎల్ గోడౌన్ కోసమద్దగోలు లీజు.

సర్కారు సొమ్ము దుర్వినియోగం,

వేల్లంకిలో హైవె పక్కనే లిక్కర్ డిపో,

టీడీపీ నేత భూముల్లో నిర్మాణం,

ఐదేళ్లకు రూ.2.85 కోట్ల అద్దె,

పనిలో పనిగా గెడ్డ స్థలం ఆక్రమించుకున్న నేత,

హై వేకు అనుకోని ఉన్న ఆ నిర్మాణంలో ట్రాపిక్ సమస్యలు,

 

విశాఖపట్నం : ప్రభుత్వ సంస్థలు ఏదైనా భారీ ప్రాజెక్టులు చేపట్టలను కుంటే మొదట సొంత వసతిని సమకూర్చుకునెందుకు ప్రయత్నిస్తాయి. ప్రాజెక్ట్ కంటే వసతి భారమే ఎక్కువగా ఉన్న పక్షంలో ప్రెవేటు లీజులపై ఆధారపడతారు. కానీ విశాఖ జిల్లలో అన్ని రకాల వసతులకు అవకాశం

ఉన్నా పట్టించుకోలేదు. లీజుకు తీసుకుంటే కోట్లాది రూపాయల ప్రభుత్వ దానం దుర్వినియోగామావుతుందని తెలిసినా పాలకులు దాని వైపు ముగ్గు చూపారు. టీడీపీ నేతకు అడ్డగోలుగా లబ్ది చేకుర్చాలనే నిర్ణయించారు. ఆనందపురం మండలం వెల్లంకి పరిధిలో ఇదే తరహాలో జాతీయ రహదారి పక్కన ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారన్ లిక్కర్) డిఫో-1 ఏర్పాటు వ్యవహారo వివాదాస్పదమవుతుంది. లిక్కర్ నేతకే లీజు గతంలో ఐఎంఎఫ్ఎల్డిఫో – 1 విశాఖ నగరంలో ఉండేది. అక్కడ వసతి భారం పెరగడంతో నగరశివారుకు తరలించేందుకు నిర్ణయించారు. దీంతో లిక్కర్ వ్యాపారంలో ఆరితేరిన ఆనందపురం మండల టీడీపీ నాయకుడు రంగంలోకి దిగారు. ఓ మంత్రిని అడ్డం పెట్టుకొని ఎక్సేజ్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. వెల్లంకి పరిధిలో జాతీయ రహదారి పక్కన తమ కుటుంబీకులకు చెందిన స్థలాన్ని చూపించి. అక్కడ తాత్కాలిక ప్రతిపాదికాన నిర్మాణాలు చేసి లీజుకిచ్చేందుకు ప్రతిపాదించాడు . అయన ప్రతిపాదించడమే తరువాయి … ఆగమేఘాల మీద లీజు ఒప్పందం కుదిరిపోయింది. 42.750 చదరపు అడుగుల స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు పూర్తి చేసి డిపోకు అప్పగించారు. అడుగుకు నెలకు రూ.9 చొప్పున లీజు మొత్తంగా నిర్ణయించారు. అంటే నెలకు రూ.3,84, 750 అంటే ఏడాదికి రూ 46.17 లక్షలు ఐదేళ్ళు కాలపరిమితికి లీజుకిచ్చిన నేపధ్యంలో మొత్తం రూ.2.85 కోట్లు లీజు రూపంలో సదరు టీడీపీ నేతకు చెల్లించాల్సి వస్తుంది. వాస్తవానికి ఆ సొమ్ముతో ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయడంతో పాటు పక్కా భవనాలను కూడా నిర్మించుకోవచ్చు/ కాని టీడీపీ నేతకు అడ్డగోలుగా ప్రతినెలా లక్షలు దోచిపెట్టేందుకు డిఫోను ఇక్కడ ఏర్పాటు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. లీజు వ్యవహారం అల ఉంటే సదరు టీడీపీ నేత సందట్లో సడేమియా అన్నట్లు పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రోరంబోకు గెడ్డ భూమిని కూడా తన స్థలానికి కలిపేసి నిర్మాణాలు చేపట్టేశారు. ఐఎంఎఫ్ఎల్ డిఫో – 1 కోసం సర్వే నంబరు 118/1లో స్థలాన్ని లీజు రూపంలో ప్రభుత్వం తీసుకోగా ఆ స్థలానికి అనుకోని తూర్పు వైపున ఉన్న సర్వ్ నెంబర్ 119/1లోని సుమారు 60 సెంట్ల గెడ్డ పోరంబోకును కూడా ఆక్రమించి నిర్మాణాలు జరిపారు. ఆ స్థలం కూడా లీజుకిచ్చిన స్థలంలో కలిసిపోవడంతో దానికి కూడా లీజు వసూలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తన సొంత స్థలానికి తనే అద్దె చెల్లించుకుంటోoదన్న మాట. ఒకప్పడు ఎంతో విశాలంగా ఉన్న గెడ్డ ప్రస్తుతం నామరూపాలు లేకుండా పోయింది. కాగా కోట్లాది రూపాయల విలువైన గెడ్డ స్థలం ఆక్రమణకు గురైందని వెల్లంకి గ్రామానికి చెందిన బోడుగు బలహీన ప్రజలు ఈనెల ఒకటో తేదిన ప్రజావాణిలో పిర్యాదు చేశారు. డిఫో నిర్మాణం, గెడ్డ ఆక్రమణపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాని ఇంత వరకు అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.

ఇదిలా ఉండగా అత్యంత రద్దీగా ఉండే 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుకుని ఆనందపురం ప్లేఓవర్ దిగువున మలుపు తిరిగే చోట ఏర్పాటైన ఈ భారి లిక్కర్ డిఫో వాళ్ళ ట్రాఫిక్ సమస్యలు ఉర్పన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరంద్ర జిల్లాలకు లిక్కర్ సరపరా చేసే ఈ గోడౌన్ కు పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. అయితే గోడౌన్కు అనుకునే హైవె ఉండటం, సరిగ్గా ప్లేఒవేర్ దిగువనే నిర్మాణాలు చేపట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగే అవకాశముంది. భారి ప్రమాదాలు జరిగేముప్పు కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>