Breaking News,

బీజేపీ సోషల్ మీడియా ఆక్టివ్ సభ్యులపై ఆరోపణలు చేసిన అమీర్ ఖాన్

3

 

బీజేపీ సోషల్ మీడియా ఆక్టివ్ సభ్యులపై ఆరోపణలు చేసిన అమీర్ ఖాన్

మోదీ ప్రభుత్వాన్ని విమర్శించేరీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటంతో ఆయనను తన బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించేలా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ పై ఒత్తిడి తేవాలని ఏకంగా బీజేపీ సోషల్ మీడియా సెల్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంలో స్నాప్ డీల్ పై ఒత్తిడి పెంచేలా సోషల్ మీడియాలో, వాట్సాప్ లలో ప్రచారం ముమ్మరం చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అరవింద్ గుప్తా తన శ్రేణులకు సూచించారని మాజీ వాలంటీర్ ఒకరు వెల్లడించారు. గతంలో బీజేపీ సోషల్ మీడియా సెల్ వాలంటీర్ గా పనిచేసిన సాధ్వి ఖోస్లా త్వరలో తీసుకువస్తున్న ఓ పుస్తకంలో ఈ ఆరోపణలు చేశారు.  ఈ వివాదం నేపథ్యంలో 2016 జనవరిలో బ్రాండ్ అంబాసిడర్ గా ఆమిర్ కాంట్రాక్టు ముగియగా.. దానిని స్నాప్ డీల్ కొనసాగించలేదు. 2015 నవంబర్ 23న ఓ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో అసహనం వివాదం నేపథ్యంలో తన భార్య భారత్ విడిచివెళ్లిపోదామా? అని అడిగిందని, దేశంలోని భయానక పరిస్థితి ఆమెతో అలా అనిపించిందని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమిర్ ను ఇరకాటంలో పెట్టే ప్రచారానికి బీజేపీ ఐటీ సెల్ పూనుకుందని, ఆయనను స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించేలా ఒత్తిడి తెచ్చిందని ఆమె ఖోస్లా ఆరోపించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>