Breaking News, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్లమెంటు & దేశ రాజకీయలు

మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు

maxresdefault

 

మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు

రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  వ్యాపార భాగస్వాములు రుణ ఎగవేతదారులుగా ముద్రపడ్డారు. ఇక్కడి ఇండియన్‌ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. దీంతో వారిని రుణ ఎగవేతదారులుగా పరిగణించిన బ్యాంకు అధికారులు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు, పత్రికా ప్రకటనలు జారీ చేశారు. తీసుకున్న రుణాల్ని వడ్డీతోసహా చెల్లించాలని బ్యాంకు పలుమార్లు డిమాండ్‌ నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో.. చివరి అస్త్రంగా  వారు హామీగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకు బుధవారం పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇందులో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులు కూడా ఉండడం కలకలం రేపుతోంది. ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2005 ఆగస్టు 18న కంపెనీల చట్టం కింద రిజిస్టర్‌(రిజిస్ట్రేషన్‌ నం.047165) అయ్యింది. మాన్యుఫ్యాక్చరింగ్, మిషనరీ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ కార్యకలాపాలకు ఉద్దేశించిన ఈ సంస్థ.. రూ.500 కోట్ల ఆథరైజ్డ్‌ క్యాపిటల్, రూ.240.671 కోట్ల పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌తో ఏర్పాటైంది. ఈ సంస్థకు యాక్టివ్‌ డైరెక్టర్లుగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకరరావు వ్యవహరిస్తున్నారు.  మంత్రి గంటాతోపాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నె అమూల్యలతోపాటు ప్రత్యూష ఎస్టేట్స్‌ ప్రైవేటు లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్‌ ట్రేడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌లు ప్రధాన హామీదారులుగా ఉన్నారు. సంస్థ విస్తరణ పేరుతో విశాఖలోని ఇండియన్‌ బ్యాంక్‌ డాబాగార్డెన్స్‌ శాఖ నుంచి రూ.141,68, 07,584 రుణం తీసుకున్నారు. అయితే ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఫలితంగా  ఈ ఏడాది డిసెంబర్‌ 13 నాటికి వడ్డీతో కలిపి వారు చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తం రూ.196,51,00,717గా ఇండియన్‌ బ్యాంకు లెక్కకట్టిం గత అక్టోబర్‌ 4న బ్యాంకు డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. నోటీసందిన 60 రోజుల్లోగా రుణబకాయి చెల్లించాలని, లేకుంటే కంపెనీతోపాటు డైరెక్టర్లు, హామీదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అందులో స్పష్టం చేసింది. అయినప్పటికీ సంస్థ ఒక్క రూపాయీ చెల్లించలేదు. దీంతో ఆస్తుల స్వాధీనానికి బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్లుగా ఉన్న పరుచూరి వెంకటభాస్కరరావు, రాజారావు, వెంకయ్య ప్రభాకరరావుల ఆస్తులతోపాటుగా హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కేబీ సుబ్రహ్మణ్యం, అమూల్యల ఆస్తులనూ స్వాధీనం చేసుకుంటున్నామంటూ బ్యాంక్‌ స్వాధీనత ప్రకటన జారీచేసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరి ఆస్తులను ఈ నెల 21 నుంచి 26వ తేదీ మధ్య స్వాధీనం చేసుకున్నట్టుగా బ్యాంక్‌ అధికారులు ప్రకటించారు. విశాఖ నగరంతోపాటు గాజువాక, చినగదిలి, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడల్లోని ప్రత్యూష కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ఈ కంపెనీలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగారు. ఈ సంస్థకే జిల్లా గ్రంథాలయసంస్థ నిర్మాణ బాధ్యతలు అప్పగించగా.. ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ మూర్తి చేపట్టిన ఉద్యమంతో ప్రభుత్వం వెనక్కి తగ్గడం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకే గత నెలలో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.

ప్రత్యూష కంపెనీలో ఒకప్పుడు నేను డైరెక్టర్‌గా వ్యవహరించిన మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం ఆ కంపెనీతో నాకెలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. ఆ కంపెనీ ఇండియన్‌ బ్యాంకులో తీసుకున్న రుణాలకు గ్యారంటీర్‌గా ఉన్నాను. రుణ బకాయిలు చెల్లిం చకపోవడంతో కంపెనీ డైరెక్టర్లతోపాటు గ్యారం టర్‌గా ఉన్న నాకు కూడా నోటీసులిచ్చారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>