Breaking News, దేశ అబివ్రుద్ది పధకాలు, పార్లమెంటు & దేశ రాజకీయలు

మేం చేసిన అభివృద్ధి ఇదిగో…

2

 

మేం చేసిన అభివృద్ధి ఇదిగో…

యూపీఏ సర్కారు హయాంలో ఏవేవో గొప్పలు చేశామని కాంగ్రెస్‌ నేత అంటున్నారు. సబ్సిడీ సిలిండర్లను 9 నుంచి 12కు పెంచడం గొప్ప విజయంగా చెప్పుకొంటున్నారు. కానీ మా ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువనున్న దాదాపు 5 కోట్ల మందికి గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చింది. దాదాపు 18 వేల గ్రామాలు కరెంటు లేకుండా 18వ శతాబ్దంలోలాగా గడిపాయి. మేం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లోనే 12 వేల గ్రామాలను విద్యుదీకరించాం. మిగతా 6 వేల గ్రామాలకూ విద్యుత్‌ ఇచ్చే పనులు జరుగుతున్నాయి. ఇదంతా ధనికులను ఉద్దేశించి చేసినదా? పేదలకు సాధికారత కల్పించడం కోసం చేసింది కాదా? 40 ఏళ్లపాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీ- సైనిక బలగాలకు ఒకే ర్యాంకు, ఒకే పింఛను(ఓఆర్‌ఓపీ) కోసం ఏమీ చేయలేదు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు- మోదీ ఎక్కడ అధికారంలోకి వచ్చి సైనికులకు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో రూ.500 కోట్లకు పైగా ఇచ్చారు. ఓఆర్‌ఓపీకి రూ.10వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. అయినా దానిని దశలవారీగా ఇవ్వడానికి మేం ముందుకువచ్చాం.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>