Breaking News

రిమోట్ ని దొంగలించి 22 సంవత్సరాలు జైలు శిక్ష

Vector illustration of a man lock up in prison

అత‌డో దొంగ‌.. ఎన్నో చోరీల‌కు పాల్ప‌డి.. జైలుకు వెళ్లొచ్చాడు. టీవీ రిమోట్‌ దొంగ‌త‌నం చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డడంతో ఏకంగా 22ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. అమెరికాలోని చికాగో సిటీలో ఉండే ఎరిక్ బ్రామ్‌వెల్(35) కొన్నేళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. అందుకు గానూ ప‌లుసార్లు పోలీసుల‌కు చిక్కి జైలుశిక్ష అనుభవించాడు. రెండేళ్ల కిందట చికాగోలోని మెల్ రోస్ పార్క్ ఏరియాలో 100 బ్లాక్ ఆఫ్ క్రాస్ వీధిలోని ఓ అపార్ట్ మెంట్లో చోరీ చేశాడు. చోరీ అంటే ఏ బంగార‌మో న‌గ‌దో కాదు టీవీ రిమోట్‌ను చోరీ చేశాడు. ప‌దేప‌దే ఓ దొంగ‌ ఇలాంటి చోరీలకే పాల్పడుతుండ‌డంతో అనుమానం వ‌చ్చిన పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌లో వేలిముద్రలు, కొన్ని వివరాలు సేకరించి, ఎరిక్ వేలిముద్రలు, డీఎన్‌ఏతో వాటిని పోల్చి చూశారు. చివ‌రికి ఇటువంటి చోరీల‌కు పాల్ప‌డుతోంది అత‌డే అని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. తాను ఆ అపార్ట్‌మెంటులో రిమోట్ చోరీ చేసినట్లు ఎరిక్ ఒప్పుకున్నాడు. ఇటువంటి ప‌లు చోరీలకు పాల్పడిన అత‌డికి చికాగో కోర్టు 22 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ప‌దేళ్ల శిక్ష అనుభ‌వించిన త‌రువాత అతడికి పెరోల్ అవకాశం కల్పిస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>