Breaking News, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు,

విద్యార్ధులు ప్రయాణిస్తున్న ఆటో బోల్త విద్యార్ధులకు తీవ్ర గాయాలు

26

 

విద్యార్ధులు ప్రయాణిస్తున్న ఆటో బోల్త విద్యార్ధులకు తీవ్ర గాయాలు ..  విశాఖపట్నం/గాజువాక  విధ్యార్ధులను విద్యాలయానికి తెసుకేల్తున్న ఓ ఆటో బోల్త పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్ధులు గాయాలపాలయ్యారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు గాజువాక పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక కనితి రోడ్డులోని ఓ ప్రైవేట్ విద్యాలయంలో పది మంది విద్యార్ధులకు స్థానిక శ్రీనగర్ ధరి దిబ్బపాలెం, రామ్ నగర్ ప్రాంతాల నుంచి ఆటో లో వస్తుంటారు. బుధవారం కూడా వారు ఆటోలో దిబ్బపాలెం నుంచి బయల్దేరి సుందరయ్య కాలనీవైపు రోడ్డు ఎత్తు భాగం నుంచి కిందకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పింది. అదే సమయంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్త పడింది. ఈ సంఘటనలో ఝాన్సీ,  దినేష్, సాయి మనికంట, పి. నవ్య, సిహెచ్, సౌజన్య, యెన్ యామిని. సి హెచ్, పవన్ కుమార్ గాయపడి ఆటో కింద చిక్కుకుపోయారు. ప్రమాదం నుంచి వెంటనే తేరుకున్న ఆటో డ్రైవర్ తుమ్మల బాబురావు ఆటో ను పైకి లేపి విధ్యార్ధులను బయటకు లాగాడు. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విధ్యార్ధులను గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఝన్సి, దినేష్, సాయి  కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ప్రైవేట్ అస్పాత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు ను ఎస్ ఐ పి.ఎ రాజు దర్యాప్తు చేస్తున్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>