Breaking News, గెస్ట్ పోస్టులు

సభ నడిపే విషయంలో మొండిగా పోవాలనే ఆలోచన తమకు లేదు : కెసిఆర్

1368

 

సభ నడిపే విషయంలో మొండిగా పోవాలనే ఆలోచన తమకు లేదు : కెసిఆర్

 

శాసన సభను నడిపే విషయంలో మొండిగా పోవాలనే ఆలోచన తమకు లేదని, ప్రతిపక్షాల నుంచి మంచి సూచన వస్తే స్వీకరిస్తామని, ఎన్ని రోజులైనా శాసనసభను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సీపీఎంలు శాసనసభను ఒక రోజు బహిష్కరించిన నేపథ్యంలో ప్రతిపక్షాలనుద్దేశించి సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో అధికారం రావడం, పోవడం సర్వసాధారణమేనని, అది ప్రజలిచ్చే గ్రాంటని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా ప్రజాస్వామ్య భారతదేశంలో తొలిసారి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం సొంతబలంతో అధికారంలోకి వచ్చిందని, ఆ విధంగా బీజేపీకి ప్రజలు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అంత మాత్రాన ప్రతిపక్షాలు అసూయ పడాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాసనసభలో  భూసేకరణ బిల్లుపై తన ప్రసంగం తర్వాత మల్లన్నసాగర్‌ ప్రాంతం నుంచి తనకు పలు ఫోన్‌కాల్స్‌ వచ్చాయని, ఈ విషయంలో ప్రగతికి ప్రతిబంధకమైన అంశాలను మాత్రమే తొలగించి చట్టం చేసుకున్నామని చెప్పారు. అయితే, ప్రతిపక్షాలు సభ నుంచి వెళ్లిపోవడం తనకు బాధ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష నేత జానారెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ఇతర నాయకులకు కూడా చెబుతున్నా.. సభను పరిపుష్టిగా అందరం కలసి నడుపుకుందాం. సభకు రండి.’అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్ని రోజులైనా సభను నడపడానికి సిద్ధమని అన్నారు. ఏమైన సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించేందుకు తాము సిద్ధమని, సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>