Breaking News, ఆంధ్రప్రదేశ్, పార్లమెంటు & దేశ రాజకీయలు

సహరా డైరీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు : ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లడి

5555555555

 

సహరా డైరీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు : ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లడి

న్యూఢిల్లీ: బుధవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా కిక్కిరిసిన కోర్టు రూమ్ లో ప్రశాంత్ భూషణ్ సహరా డైరీలలో పేర్లు ఉన్న రాజకీయ నాయకుల వివరాలు వెల్లడించారు. ఈ కేసులో జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, జస్టిస్ అమితావ రాయ్ తో కూడిన ధర్మాసనం ముందు ఆయన వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా కోర్టులో ఉన్న సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖురేషి ఇరకాటంలో పడ్డారు. సహరా డైరీలలో చేతిరాతతో రాసిన ముడుపులు అందుకున్న వారి జాబితాలో ఆయన పేరు నాలుగుసార్లు ఉందని భూషణ్ స్పష్టం చేశారు. 2014లో సహరా గ్రూప్ పై జరిపిన ఐటీ శాఖ దాడులలో దొరికిన డైరీలలో రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పిన విషయాలు ఉన్నట్టు వెలుగుచూడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ డైరీలో ఉన్న నాయకుల పేర్లను భూషణ్ కోర్టులో చదువుతూ.. చంద్రబాబుజీ, ములాయం సింగ్ జీ, మాయావతిజీ, ప్రమోద్ జీ కూతురు, శివ్ రాజ్ జీ, రాజస్థాన్, బిహార్ ముఖ్యమంత్రులు, లాలూ జీ, అద్వానీ జీ, రవిశంకర్ జీ, షిండేజీ, ఫరూక్ అబ్దుల్లాజీ, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, దిగ్విజయ్ సింగ్’ తదితరుల పేర్లు ఉన్నట్టు తెలిపారు. ‘దాదా’ అనే పేరు ఈ డైరీలలో నాలుగుసార్లు రాసి ఉంది. కానీ, ఆయన ఎవరు అని ఊహించడానికి కూడా ఎవరూ సాహసం చేయడం లేదు. ఈ కేసుకు 1990నాటి జైన్-హవాలా కేసుకు ఎన్నోరకాలుగా సారూప్యముంది. జైన్-హవాలా కేసులో రాజకీయ నాయకులు పేర్ల ఇనీషియల్స్ ఉండగా.. సహరా డైరీలలో పేర్లు ఉన్నాయి. సహారా గ్రూప్‌నకు సంబంధించి పిటిషన్‌ దారు కోర్టుకు అందించిన పత్రాలు నిజమైనవి కావనడానికి సాక్ష్యాలున్నాయని ఐటీ శాఖ సెటిల్మెంట్‌ కమిషన్‌ ఇప్పటికే స్పష్టం చేసిందన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>