Breaking News

10మంది ఉగ్రవాదుల హతం

ఉరీ సెక్టార్‌లోని లచిపొరా, ఎల్‌ఓసీ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్ దళాలను సమర్థంగా తిప్పికొడుతున్న భారత్ బలగాలకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరింత స్థయిర్యాన్ని ఇచ్చారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాక్ దళాలపై విరుచుకుపడాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్మీ డీజీ‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన దళాలకు స్వేచ్ఛను ఇచ్చారు. మొన్న ఉరీ సెక్టార్‌లోని ఆర్మీ బేస్‌క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గని పాక్ తాజాగా కాల్పులకు ఉల్లంఘనకు తెగబడి భారత్ స్థావరాలపై కాల్పులకు తెగబడింది. భారత బలగాలు పాక్ దళాల కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నాయి.రత సైనికులను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన స్వేచ్ఛ తొలి ఫలితాన్ని ఇచ్చింది. ఊరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబడేందుకు వీలు కలిగేలా పాక్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. వేగంగా స్పందించిన భారత దళాలు పాక్ దాడులను తిప్పి కొట్టే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆర్మీ డీజీకి ఫోన్ చేసి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రెచ్చిపోయిన ఆర్మీ పాక్ దళాలపై విరుచుకుపడింది. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించాలన్న వ్యూహాన్ని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఆర్మీ కాల్పుల్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. మరింతమంది మరణించి ఉండవచ్చిన ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>