Breaking News

మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు పరారి

central_jail__bhopal

మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. జైలు సెక్యురిటీ గార్డును హత్య చేసి పరారయ్యారు. సిమీ ఉగ్రవాదులు బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారని భోపాల్ ఎస్పీ అరవింద్ సక్సెనా తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు మమ్మురం చేశామన్నారు.ఇంతకుమందు కూడా ఇదే తరహాలో సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారు. 2013లో ఏడుగురు సిమీ ఉగ్రవాదులు ఖాంద్వా జైలు మరుగుదొడ్డి కిటికీ ఇనుప రాడ్డులను తొలిగించి పరారయ్యారు. ఇద్దరు జైలు సెక్యురిటీ సిబ్బందిపై దాడి చేసి రైఫిళ్లు, వైర్లెస్ సెట్లను తస్కరించారు.నిషేధిత సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కు చెందిన 8 మంది ఉగ్రవాదులు ఆదివారం రాత్రి ఒక గార్డును చంపి భోపాల్ జైలు నుంచి పరారయ్యారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో టెర్రరిస్టులు కత్తితో హెడ్‌ కానిస్టేబుల్ రామశంకర్ గొంతుకోసి ఆ తర్వాత దుప్పట్లతో బౌండ్రీవాల్ (జైలుగోడ) ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుగుతున్న తరుణంలో వారు పారిపోవడానికి ప్లాన్ చేసుకుని తమ పథకాన్ని పక్కాగా అమలుచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. భోపాల్‌లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పహారా కాస్తున్నారు.మూడేళ్ల క్రితం కూడా ఏడుగురు సిమీ ఉగ్రవాదాలు భోపాల్‌కు 280 కిలోమీటర్ల దూరంలోని ఖ్వాండ్వాలో ఇదే తరహాలో జైలు నుంచి పరారయ్యారు. అప్పట్లో బాత్‌రూమ్ గోడ బద్దలు కొట్టి వారంతా తప్పించుకున్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>