Breaking News

అమెజాన్ సంస్థ తీరుపై కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహం

amazon

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ తీరుపై కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ఆన్‌లైన్ షాపింగ్ ఉత్పత్తుల్లో భారతీయులను అవమానించేలా వస్తువులను విక్రయిస్తున్నారని ఇది వారికి తగదన్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే అమెజాన్ సంస్థ ఉద్యోగులకు వీసా ఇచ్చే ప్రసక్తేలేదని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. విషయం ఏంటంటే.. అమెజాన్ సంస్థ కెనడా విభాగం భారత జాతీయ పతాకాన్ని డోర్ మ్యాట్స్ పై ప్రింట్ చేసి ఆన్ లైన్‌ విక్రయాలు చేస్తోంది. ఈ విషయాన్ని అటుల్ భోబ్ అనే ట్విట్టర్ యూజర్ కేంద్రమంత్రి సుష్మా దృష్టికి తీసుకెళ్లారు. త్రివర్ణ పతాకాని అవమానిస్తున్న ఆమెజాన్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ట్విట్లర్ ద్వారా సుష్మా స్వరాజ్‌ను కోరారు.అమెజాన్ చర్యలపై స్పందించిన మంత్రి సుష్మా.. ఆ సంస్థ భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమై జాతీయ పతాకాన్ని అవమానించేలా ఉన్న ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే అమెజాన్ ఉద్యోగులు, అధికారులకు భారత్ వీసా ఇచ్చే ప్రసక్తేలేదని గట్టిగా హెచ్చరించారు.గతేడాది ఆగస్టులో హిందూ దేవుళ్ల ఫొటోలను ప్రింట్ చేసిన డోర్ మ్యాట్స్ ను ఆన్‌లైన్లో విక్రయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సంస్థ ఈ ఉత్పత్తులను తమ వెబ్ పోర్టల్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అమెజాన్ వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదంపై అమెజాన్ అధికారులు సోషల్ మీడియాలో, అధికారికంగానూ ఎలాంటి ప్రకటన చేయలేదు.ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. కెనడాలో భారత త్రివర్ణ పతాకం చిత్రంతో రూపొందించిన డోర్‌మ్యాట్లను విక్రయిస్తోంది. ఇది భారతను కించపరచడమేనని.. వాటి విక్రయాలను వెంటనే ఆపేసి.. విక్రయించిన వాటిని వెనక్కు తీసుకోవాలని భారతీయులు డిమాండ్‌ చేస్తున్నా ఇప్పటి వరకూ ఆ సంస్థ పట్టించుకోలేదు. చివరకు ఛేంజ్‌.ఆర్గ్‌ అమెజాన్‌ చర్యకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌ పిటిషన్‌ వేసినా.. ఆ సంస్థ స్పందించలేదు. ఈ పిటీషన్‌ ఈ నెల 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు అమెజాన్‌.కామ్‌ కూడా ఇలాంటి ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చి తర్వాత వెనక్కు తీసుకుందని ఆ పిటిషన్‌ వెల్లడించింది. కానీ కెనడా సైట్‌లో మాత్రం తొలగించలేదని.. ఇంకా విక్రయాలు సాగిస్తోందని తెలిపింది. ఈ విషయం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలిసింది. దీంతో ఆమె సీరియస్‌ అయ్యారు. అమెజాన్‌ వెంటనే ఆ డోర్‌మ్యాట్‌ల విక్రయాలనే ఆపేసి భారతకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో అమెజాన్‌కు, ఆ సంస్థ ఉద్యోగులకు భారత వీసాలను నిషేధిస్తామని, ఇప్పటికే ఇచ్చిన వారి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని వెంటనే అమెజాన్‌ కెనడా దృష్టికి తీసుకెళ్లాలని కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించారు. అతుల్‌ భోబే అనే వ్యక్తి అమెజాన్‌ కెనడా విక్రయిస్తున్న త్రివర్ణ డోర్‌మ్యాట్‌ చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్‌ చేసి సుష్మాస్వరాజ్‌ను ట్యాగ్‌ చేశారు. ‘‘మేడం.. అమెజాన్‌ కెనడా మన త్రివర్ణ పతాకంతో కూడిన డోర్‌మ్యాట్లను విక్రయించకుండా గట్టిగా హెచ్చరించండి.. అని కోరారు.’’ దీనికి స్పందించిన సుష్మాస్వరాజ్‌ తీవ్ర స్థాయిలో వరుస ట్వీట్లతో మండిపడ్డారు. త్వరగా ఆ సంస్థ వాటిని వెనక్కు తీసుకోకుంటే ఇకపై అమెజాన్‌కు వీసాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>