Breaking News

ఓవర్లు అయిపోవడంతో అండర్సన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కోల్పోయాడు

andersonfb-story
బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ-ట్వంటీలో కివీస్ బ్యాట్స్‌మెన్ అండర్సన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కళ్లు చెదిరే బౌండరీలతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడు కేవలం 41 బంతుల్లోనే 2 ఫోర్లు, 10 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. అండర్సన్ మెరుపు ఇన్నింగ్స్ ధాటికి కివీస్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న టీ-ట్వంటీ సిరీస్‌ను కివీస్ 3-0తో గెలుచుకుంది. ఓవర్లు అయిపోవడంతో అండర్సన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కోల్పోయాడు.మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. విలియమ్సన్ 60 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా ఓవర్లన్నీ ఆడి ఆరు వికెట్లు కోల్పోయి 167 పరుగులే చేసింది. దీంతో కివీస్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. మౌంట్ మాన్గాని:బంగ్లాదేశ్ తో జరిగిన చివరిదైన మూడో ట్వంటీ 20 న్యూజిలాండ్ ఆటగాడు కోరీ అండర్సన్ చెలరేగిపోయాడు.  41 బంతుల్లో 10 సిక్సర్లు, 2 ఫోర్లతో 94 పరుగులు నమోదు చేసి అజేయంగా నిలిచాడు.  తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 27 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.  అంతకుముందు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(60) బాధ్యతాయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 20.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓటమి పాలైంది. బంగ్లా ఆటగాళ్లలో తమిమ్ ఇక్బాల్(24) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, సౌమ్య సర్కార్(42), షకిబుల్ హసన్(41)లు రాణించారు. అయితే లక్ష్యం ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్ కు పరాజయం తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో బోల్ట్, సౌథీలకు తలో రెండు వికెట్లు లభించగా,సాంట్నార్, విలియమ్సన్లకు చెరో వికెట్ దక్కింది.సౌమ్యా సర్కార్ 42, షకీబ్ 41 రాణించారు. అసాధ్యమైన ఇన్నింగ్స్ ఆడిన అండర్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది.
టీ-ట్వంటీలో ఫాస్టెస్ట్ సెంచరీలు
రిచర్డ్స్ లెవీ 45 బంతులు
డుప్లెసీస్ 46 బంతులు
గేల్, ఫించ్ 47 బంతులు
మ్యాక్స్‌వెల్ 49 బంతులు
మెక్‌కల్లమ్ 50 బంతులు
గేల్ 50 బంతులు

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>