Breaking News, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్లమెంటు & దేశ రాజకీయలు,

దేవనార్ అంధ విద్యార్థుల పాఠశాల రజతోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

img-20161116-wa0026

హైదరాబాద్ : రాష్ట్రంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసిఆర్ 254 గురుకుల పాఠశాలలను ఇచ్చారని, వచ్చే ఏడాది కూడా మరో 200 గురుకుల పాఠశాలలను ఇవ్వనున్నట్లు చెప్పారు. రాబోయే రెండు వందల గురుకుల పాఠశాలలో అంధ విద్యార్థులు, మూగ-చెవిటి విద్యార్థులు, మానసిక వికలాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ను కోరుతామన్నారు. అంధ విద్యార్థుల కోసం గత 25 సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేవనార్ ఫౌండేషన్ స్కూల్ రజతోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

దేవనార్ ఫౌండేషన్ విద్యార్థులు ఈ ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను చూసిన ఉపముఖ్యమంత్రి వారి కృషికి, పట్టుదలకు, తెలివితేటలకు ముగ్ధులయ్యారు. ఫౌండేషన్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో తాను విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఇక్కడకు ఎందుకు రాలేకపోయానని ఇప్పుడు ఫీల్ అవుతున్నానని చెప్పారు. మొదటి సారి ఇక్కడకు రావడం, ఈ ఫౌండేషన్ విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, వారికి వెన్నంటి నిలుస్తున్న నిర్వాహకులే సమాజంలో నిజమైన హీరోలని అభివర్ణించారు. దేవనార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు సాయిబాబా గౌడ్, ఆయన సతీమణి జ్యోతిగౌడ్ అంధ విద్యార్థుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేందుకు, విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపేందుకు చేస్తున్న కృషి నిజంగా చాలా సాహసోపేతమైనదిగా కొనియాడారు. దేవనార్ ఫౌండేషన్ ఈ స్థాయికి రావడానికి అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది అంకితభావం గొప్పదన్నారు.

దేవనార్ ఫౌండేషన్ తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చేఏడాది ప్రారంభించనున్న దివ్యాంగుల గురుకుల పాఠశాలల కోసం సాయిబాబా గౌడ్ సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. దివ్యాంగుల గురుకుల పాఠశాలలు ప్రారంభించేందుకు దేవనార్ ఫౌండేషన్ స్పూర్తిగా నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వీసీ సీతారామారావు, జిల్లా విద్యాధికారులు పాల్గొన్నారు. రజతతోత్సవాల్లో భాగంగా జరిగిన వివిధ కార్యక్రమాలు, పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బహుమతులు అందించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>