Breaking News

పాకిస్థాన్‌ ఒక్క భారత్‌నే కాదు మొత్తం ప్రపంచాన్నే మోసం చేసిందా?

cs-nuke-lead-jun
భారత్‌ను భయపెట్టాలనుకున్న పాక్ బొక్కబోర్లా పడింది. పాకిస్థాన్‌ ఒక్క భారత్‌నే కాదు మొత్తం ప్రపంచాన్నే మోసం చేసిందా? అసలు ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే అది చేసినట్లు అందులో విజయం సాధించినట్లు డంబాలు పలికి అందర్నీ బోల్తా కొట్టించిందా? అంటే అవుననే భారత్‌కు చెందిన నిపుణులు అంటున్నారు. అవును.. పాకిస్థాన్‌ అసలు ఏ క్షిపణిని ఈ రెండు రోజుల్లో ప్రయోగించలేదంట.ప్రపంచం దృష్టిలో నవ్వులపాలైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జలాంతర్గామి నుంచి ప్రయోగించగల అణ్వస్త్రాలు మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న బాబర్-3 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు సోమవారం పాక్ ప్రకటించింది. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని బాబర్-3 అవలీలగా ఛేదిస్తుందని పేర్కొంది. భారత్‌లోని చాలా ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయని డప్పు కొట్టుకుంది.భారత్ 2008లో జలాంతర్గామి నుంచి ప్రయోగించగల అణ్వస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. 2013లో మరోసారి జలాంతర్గామి నుంచి ప్రయోగించగల క్రూయిజ్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. దీంతో ఉడికిపోతున్న పాక్ ఆ తరహా క్షిపణులను అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. సోమవారం ఒక్కసారిగా సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించగల అణ్వస్త్ర క్షిపణి బాబర్-3ను విజయవంతంగా పరీక్షించినట్టు పేర్కొని ప్రపంచం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది.అయితే నిజానికి పాక్ ప్రయోగం మొత్తం బూటకమని నిపుణులు చెబుతున్నారు. పాక్ విడుదల చేసిన వీడియో మొత్తం కల్పితమని, దానిని అద్భుతంగా గ్రాఫిక్స్ చేశారని చెబుతున్నారు. ఫొటోషాప్‌ను ఉపయోగించిన విషయం స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. పాక్ చెబుతున్న వేగానికి అది ప్రయాణించిన దానికి అస్సలు సంబంధం లేదని చెబుతున్నారు. అలాగే మొదట్లో పసుపు వర్ణంలో ఉన్న క్షిపణి క్రమంగా తెల్లగా మారిందని.. ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ విడుదల చేసిన వీడియోలో చాలా లోపాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ వీడియోను గ్రాఫిక్స్‌తో రూపొందించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని చెబుతున్నారు. పాక్ బాబర్-3 క్షిపణి ప్రయోగం అంతా ఉత్తిదేనంటూ అందులోని ‘నకిలీ’ ప్రయోగమంటూ సోషల్ మీడియాలో మోతెక్కిపోతోంది. అది ఫేక్ టెస్ట్ అవడానికి గల కారణాలను కూడా వివరిస్తూ నెటిజన్లు షేర్లమీద షేర్లు చేస్తూ పాక్ వైఖరిని ఎండగడుతున్నారు. బాబర్-3 అంటూ ప్రపంచం ముందు పాకిస్థాన్ నవ్వులపాలైందని దుమ్మెత్తి పోస్తున్నారు.అది బాబర్‌ 3 అనే క్షిపణిని తొలిసారి జలాంతర్గామి నుంచి ప్రయోగించినట్లు అది విజయం సాధించినట్లు పాక్‌ మీడియా చెప్పిన విషయం తెలిసిందే. అయితే, భారత్‌కు చెందిన రక్షణశాఖ, ఉపగ్రహ పరీశీలన విశ్లేషకులు మాత్రం పాక్‌ చెప్పేదంత బూటకం అని కొట్టి పారేస్తున్నారు. దీనికి సంబంధించి రాజ్‌ అనే ప్రముఖ విశ్లేషకులు పాక్‌ ప్రపంచాన్ని ఎలా మోసం చేసింది ఉదాహరణతో వివరించారు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ద్వారా బాబర్‌ 3ని ప్రయోగించినట్లు వీడియో రూపొందించి అందరినీ బోల్తా కొట్టించిందని చెప్పారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>