Breaking News

ఫిబ్రవరి నెలాఖరుకల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి

sbi
పెద్ద నోట్ల రద్దు గడువు ముగిసిన తర్వాత కూడా డిమాండ్‌కు తగినట్టుగా కరెన్సీ అందుబాటులో రాకపోవడంతో ప్రజల కష్టాలు ఇంకా తీరలేదు. ఇప్పటికీ చాలా ఏటీఎంలు పనిచేయడం లేదు. దీనికి తోడు బ్యాంకులు, ఏటీఎంలో 2000 రూపాయలు నోట్లు ఇస్తుండటంతో చిల్లర సమస్య ఏర్పడింది. సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి మరో 6 నెలల సమయం పడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ చైర్మన్‌ అరుంధతి భట్టాచార్య శుభవార్త చెప్పారు. మంగళవారం మీడియాతో అరుంధతి మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు.  ‘పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్య త్వరలో తీరుతుందని నమ్ముతున్నాం. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్బీఐ ఖాతాదారులు నగదు కోసం క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఉండదని వారికి హామీ ఇస్తున్నాం. సరిపడా డబ్బును బ్యాంకు బ్రాంచిలకు పంపిస్తాం. దీనివల్ల ఖాతాదారులు వారి అవసరాలకు తగినట్టు డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చు. అలాగే డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై చర్చిస్తున్నాం. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణిలోకి వస్తాయి. ఈ విషయంలో సందేహం లేదు. కరెన్నీ అందుబాటులోకి వచ్చాక పెద్ద నోట్ల రద్దుకు ముందు మాదిరే బ్యాంకింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తాం’ అని అరుంధతి చెప్పారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు క్రమంగా తగ్గుతున్న వేళ ప్రజలకు ఎస్బీఐ మరో తీపికబురు చెప్పింది. నోట్ల రద్దు తర్వాత మొదలైన కష్టాలు మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే మార్చి వరకు కష్టాలు తప్పకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు కూడా అప్పట్లో పేర్కొన్నాయి. అయితే తాజాగా ఈరోజు ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల చివరికల్లా నోట్ల కష్టాలకు పుల్‌స్టాప్ పడుతుందంటూ తీపికబురు చెప్పారు. ఫిబ్రవరి తొలివారం నుంచే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటాయని, నెలాఖరు నాటికి పూర్తిగా సమసిపోతాయని పేర్కొన్నారు. నగదు కోసం క్యూలలో నిలబడే పరిస్థితి ఉండదని, దీనికి తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకు బ్రాంచిలకు సరిపడా డబ్బులు పంపిస్తున్నామని, దీనివల్ల ఖాతాదారులు కావాల్సినంత సొమ్మును డ్రా చేసుకోవచ్చని వివరించారు. నోట్లు మళ్లీ చలామణిలోకి వస్తాయని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు వద్దని అరుంధతి పేర్కొన్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>