Breaking News

తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తూ కడిగేశాడు దర్శకుడు గుణశేఖర్

gunashekar
దర్శకుడు గుణశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ ఘాటు లేఖ రాశాడు. పొగుడుతూనే తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తూ కడిగేశాడు.దర్శకుడు గుణశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ ఘాటు లేఖ రాశాడు. పొగుడుతూనే తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తూ కడిగేశాడు. గతంలో తాను స్వయానా నిర్మాత అవతారం ఎత్తి తీసిన రుద్రమదేవి చిత్రానికిగానూ.. వినోదపు పన్ను రాయితీపై ఈ లేఖ రాశాడు. ప్రస్తుతం బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని తన లేఖలో ప్రస్తావించిన గుణశేఖర్.. తన సినిమాకు మాత్రం చేస్తాం..చేస్తాం అని చెప్పి.. ఫైలును పెండింగ్‌లో పెట్టేసి చివరకు చేతులెత్తేసిన వైనాన్ని వివరించాడు. తెలంగాణ ప్రభుత్వం తనకు పన్ను మినహాయింపునిచ్చినా.. ఏపీ అధికారులు మాత్రం దరఖాస్తును పరిశీలించినట్టే పరిశీలించి చివరకు చేతులెత్తేశారని పేర్కొన్నాడు. ఆ లేఖ సారాంశం ఇది…gunashekar-article1

                  ‘‘చారిత్రక చలనచిత్రంగా రూపొందించిన గౌతమిపుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను రాయితీని ప్రకటించి.. కళలపట్ల, సంస్కృతి పట్ల మీరు చూపే ఆదరాభిమానాలకు సాటి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2015 అక్టోబరు 9న ప్రపంచవ్యాప్తంగా నాలుగు (తెలుగు, తమిళం, హిందీ, మలయాళం) భాషల్లో నా దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో రుద్రమదేవి చిత్రాన్ని విడుదల చేశాం. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగులో వచ్చిన చారిత్రక చిత్రం కావడంతో.. గతంలోనే వినోదపు పన్ను రాయితీ కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశాం. ముందుగా సానుకూలంగానే స్పందించిన అధికారులు పనుల్లో కొంత పురోగతిని చూపించి (నా విన్నపం మేరకు కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు) అర్ధాంతరంగా ఫైలును మూసివేశామంటూ చెప్పారు. ఆ తర్వాత మిమ్మల్ని గానీ, అధికారులను గానీ కలుసుకోవాలని శతవిధాలా ప్రయత్నించినా.. అది సాధ్యపడలేదు. పురుషాధిక్య సమాజంలో 13వ శతాబ్దంలోనే స్త్రీ సాధికారతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన కాకతీయ మహా సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి చరిత్రను.. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ పురుషాధిక్య సమాజంలో (భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదని భావిస్తున్నా) ఆదర్శవంతమైన స్త్రీ మూర్తి జీవితగాథగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కించాం. అంతేగాకుండా భారతదేశ సినీ చరిత్రలోనే మొట్టమొదటి స్టీరియో స్కోపిక్ త్రీడీ చిత్రంగా అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను తీశాం. ఈ మహత్కార్యంలో ఎందరో సినీ ప్రముఖులు నాకు అండగా నిలిచారు. సినిమా విడుదల సందర్భంలో ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ వినోదపు పన్ను మినహాయింపును కోరుతూ దరఖాస్తు చేసుకున్నాం. దానికి తక్షణమే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాయితీని కల్పించారు. నేనాశించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయింపును ప్రకటించి ఉంటే నిర్మాతగా నాకు కొంత ఉపశమనం కలిగి ఉండేది. రాణి రుద్రమదేవి కేవలం ‘తెలంగాణ’కే చెందిన వ్యక్తే కాదని, దాదాపు దక్షిణాపథమంతటినీ పాలించిన మహారాణి అని ఆమె పట్టాభిషేకం సందర్భంగా అమరావతిలోని మంగళగిరి వద్దగల మార్కాపురం శాసనాన్ని మీరు ఇటీవల ఒక సభలో ఉదహరించారు. ఈ నేపథ్యంలో నా దరఖాస్తును పున:పరిశీలించి ఇప్పటికే రుద్రమదేవి చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు’ను అందజేసి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేస్తుందని ఇదివరకు రుజువు చేసినట్లుగానే మరోమారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ తన లేఖను ముగించాడు గుణశేఖర్.కాకతీయ మహాసామ్రాజ్ఞిని ‘రాణి రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు వినోదపన్ను రాయితీని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాణిరుద్రమ దేవి కేవలం తెలంగాణకే పరిమితమైన నాయకురాలు కాదని, ఆమె దక్షిణపథమంతటినీ పాలించిన మహారాణి అని గతంలో చంద్రబాబు కూడా పేర్కొన్నారని గుర్తుచేసిన గుణశేఖర్.. ఎన్నో వ్యయప్రయాలకోర్చి 13వ శతాబ్దంలో స్త్రీ సాధికారితను ప్రపంచానికి చాటిచెప్పిన రుద్రమదేవి సినిమాను భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమాగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించానని, కాబట్టి ఏపీలో ఈ సినిమాకు వినోద పన్ను కింద వసూలు చేసిన మొత్తాన్ని ‘ప్రోత్సాహక నగదు’ కింద అందించాలని గుణశేఖర్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.గతంలో తాను స్వయానా నిర్మాత అవతారం ఎత్తి తీసిన రుద్రమదేవి చిత్రానికిగానూ.. వినోదపు పన్ను రాయితీపై ఈ లేఖ రాశాడు. ప్రస్తుతం బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని తన లేఖలో ప్రస్తావించిన గుణశేఖర్.. తన సినిమాకు మాత్రం చేస్తాం..చేస్తాం అని చెప్పి.. ఫైలును పెండింగ్‌లో పెట్టేసి చివరకు చేతులెత్తేసిన వైనాన్ని వివరించాడు. తెలంగాణ ప్రభుత్వం తనకు పన్ను మినహాయింపునిచ్చినా.. ఏపీ అధికారులు మాత్రం దరఖాస్తును పరిశీలించినట్టే పరిశీలించి చివరకు చేతులెత్తేశారని పేర్కొన్నాడు. ఆ లేఖ సారాంశం ఇది…‘‘చారిత్రక చలనచిత్రంగా రూపొందించిన గౌతమిపుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను రాయితీని ప్రకటించి.. కళలపట్ల, సంస్కృతి పట్ల మీరు చూపే ఆదరాభిమానాలకు సాటి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2015 అక్టోబరు 9న ప్రపంచవ్యాప్తంగా నాలుగు (తెలుగు, తమిళం, హిందీ, మలయాళం) భాషల్లో నా దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో రుద్రమదేవి చిత్రాన్ని విడుదల చేశాం. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగులో వచ్చిన చారిత్రక చిత్రం కావడంతో.. గతంలోనే వినోదపు పన్ను రాయితీ కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశాం. ముందుగా సానుకూలంగానే స్పందించిన అధికారులు పనుల్లో కొంత పురోగతిని చూపించి (నా విన్నపం మేరకు కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు) అర్ధాంతరంగా ఫైలును మూసివేశామంటూ చెప్పారు. ఆ తర్వాత మిమ్మల్ని గానీ, అధికారులను గానీ కలుసుకోవాలని శతవిధాలా ప్రయత్నించినా.. అది సాధ్యపడలేదు. పురుషాధిక్య సమాజంలో 13వ శతాబ్దంలోనే స్త్రీ సాధికారతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన కాకతీయ మహా సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి చరిత్రను.. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ పురుషాధిక్య సమాజంలో (భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదని భావిస్తున్నా) ఆదర్శవంతమైన స్త్రీ మూర్తి జీవితగాథగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కించాం. అంతేగాకుండా భారతదేశ సినీ చరిత్రలోనే మొట్టమొదటి స్టీరియో స్కోపిక్ త్రీడీ చిత్రంగా అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను తీశాం. ఈ మహత్కార్యంలో ఎందరో సినీ ప్రముఖులు నాకు అండగా నిలిచారు. సినిమా విడుదల సందర్భంలో ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ వినోదపు పన్ను మినహాయింపును కోరుతూ దరఖాస్తు చేసుకున్నాం. దానికి తక్షణమే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాయితీని కల్పించారు. నేనాశించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయింపును ప్రకటించి ఉంటే నిర్మాతగా నాకు కొంత ఉపశమనం కలిగి ఉండేది. రాణి రుద్రమదేవి కేవలం ‘తెలంగాణ’కే చెందిన వ్యక్తే కాదని, దాదాపు దక్షిణాపథమంతటినీ పాలించిన మహారాణి అని ఆమె పట్టాభిషేకం సందర్భంగా అమరావతిలోని మంగళగిరి వద్దగల మార్కాపురం శాసనాన్ని మీరు ఇటీవల ఒక సభలో ఉదహరించారు. ఈ నేపథ్యంలో నా దరఖాస్తును పున:పరిశీలించి ఇప్పటికే రుద్రమదేవి చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు’ను అందజేసి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేస్తుందని ఇదివరకు రుజువు చేసినట్లుగానే మరోమారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ తన లేఖను ముగించాడు గుణశేఖర్.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>