Breaking News

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. మరోవైపు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం బలపడితే రానున్న రెండు నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>