Breaking News, క్రీడలు,

విశాఖ టెస్ట్‌లో 246 పరిగుల తేడాతో భారత్‌ జయభేరి

20161121_125730-collage

విశాఖ: విశాఖ టెస్ట్‌లో టీమిండియా అదరగొట్టింది. ఇంగ్లండ్‌పై 246 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. 405 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 158 పరుగులకే ఆలౌటైంది. 87/2 స్కోరుతో ఐదోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ఏ దశలోనూ కోలుకోలేకుండా చేశారు. బెయిర్‌స్టో(34) కాస్త ప్రతిఘటించినా మిగతా బ్యాట్స్‌మెన్ల నుంచి అతడికి సహకారం అందలేదు. భారత బౌలర్లలో అశ్విన్‌ 3, ఉమేష్‌ యాదవ్‌ 3, రవీంద్ర జడేజా 2, మహ్మద్‌ షమి 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోహ్లీ కే దక్కింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన తొలిటెస్ట్‌ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>