Breaking News

జవాన్లకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో బీఎస్ఎఫ్ విచారణకు ఆదేశo

jawan1
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)పై తీవ్ర ఆరోపణలు చేసిన జవాను తేజ్ బహదూర్ యాదవ్‌ను వేరొక హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేయబోతున్నారు. ఆయనపై ఒత్తిడి లేకుండా న్యాయమైన దర్యాప్తు జరిగేందుకు ఈ చర్య తీసుకోబోతున్నారు.బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ మంగళవారం మాట్లాడుతూ యాదవ్‌ను వేరొక హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేస్తామన్నారు. ఆయనపై ఇతరులు ఒత్తిడి చేయకుండా, న్యాయమైన దర్యాప్తు నిర్వహించేందుకు దీనివల్ల వీలవుతుందన్నారు. యాదవ్ తన ఫేస్‌బుక్ పేజీలో వీడియోలను పోస్ట్ చేయడం వెనుక ఉద్దేశంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన గత చరిత్రను ప్రస్తావించారు.యాదవ్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు 2010లో కోర్టు మార్షల్‌ ఎదుర్కొన్నారని ఐజీ ఉపాధ్యాయ చెప్పారు. ఆయన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను డిస్మిస్ చేయలేదని తెలిపారు. ఆయన వీడియోలో చేసినటువంటి ఆరోపణలు గతంలో ఆ క్యాంప్‌ను సందర్శించిన డీఐజీ స్థాయి అధికారుల దృష్టికి రాలేదన్నారు. గతంలో ఆ స్థావరంలో పర్యటించిన డీఐజీలు ప్రతి జవానుతోనూ మాట్లాడారని, యాదవ్‌తోనూ మాట్లాడారని, కానీ ఎవరూ భోజనం గురించి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. బహుశా ఉద్దేశాలు వేరేవిధంగా ఉండి ఉండవచ్చునన్నారు.బీఎస్ఎఫ్ డీఐజీ ఎండీఎస్ మాన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ యాదవ్‌ 20 ఏళ్ళ సర్వీసులో నాలుగు బ్యాడ్ ఎంట్రీలు ఉన్నాయన్నారు. అందుకే ఆయనకు పదోన్నతి లభించలేదన్నారు. దీని ఫలితంగానే ఆయన మానసిక ఒత్తిడికి గురైనట్లుందని తెలిపారు.జవాన్లకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్నట్లు యాదవ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో బీఎస్ఎఫ్ విచారణకు ఆదేశించింది. ఆహారం డబ్బాల్లోనూ, పొడిగానూ ఉండటం వల్ల చలికాలంలో రుచిగా ఉండదన్నారు. అయినప్పటికీ ఏమైనా తప్పులు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.జమ్ముకాశ్మీర్లో జవానుల దీన స్థితిపై బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపడమేకాక ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఉదంతంపైన, వీడియోలో పేర్కొన్న అంశాలపైనా విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ డి.కె. ఉపాథ్యాయ మంగళవారం జమ్ములో మీడియాతో మాట్లాడుతూ ఉదంతానికి సంబంధించిన అనేక విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘మన సైనికులకు అందించే భోజనం ఏమంత బాగుండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైగా ఇది చలికాలం కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఏ ఒక్కరూ ఫిర్యాదు చెయ్యలేదు. బీఎస్‌ఎఫ్‌ చరిత్రలోనే మొదటిసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అందరం షాకయ్యాం! నిజానికి ఇదొక సున్నితమైన అంశమైనందున ముందుకుముందే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం. సమగ్ర దర్యాప్తు తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’అని ఐజీ ఉపాథ్యాయ తెలిపారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>