Breaking News, తెలంగాణ, దేశ అబివ్రుద్ది పధకాలు, పార్లమెంటు & దేశ రాజకీయలు,

ఇరిగేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేసీఆర్ సర్కారు!

kcr-new-english-paper-647x450

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల ప‌నులను మ‌రింత వేగ‌వంతం చేయాలని నిర్ణయించింది కేసీఆర్ సర్కారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిల‌వాల‌ని అధికారుల‌ను ఆదేశించింది.  ఈ నెల 10న మల్లన్న సాగర్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది ప్రభుత్వం. ఇక చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును యేడాదిలోపు పూర్తిచేసి.. ఆసియాలోనే సరికొత్త రికార్డు ను సృష్టించాల‌నుకుంటోంది స‌ర్కారు. మ‌రోవైపు ర‌బీ సీజ‌న్ స‌మీపిస్తుండ‌టంతో.. చెరువుల‌కు నీరందించాల‌ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ‌లో సాగునీటి ప్రాజెక్టుల ప‌నుల వేగ‌వంతంపై దృష్టిపెట్టింది స‌ర్కారు. ఒక‌వైపు ప్రాజెక్టుల నిర్మాణం, టెండ‌ర్ల‌తో పాటు..వాటిని యుద్ద‌ప్రాతిప‌దిక‌న నిర్మించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌ధానంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టును రికార్డు స్థాయి టైంలో పూర్తి చేయాల‌ని టార్గెట్ గా పెట్టుకుంది. బుధవారం దీనిపై జలసౌధలో మంత్రి హరీష్  రావు అధికారుల‌తో  సమీక్షించారు. ఈ ప్రాజెక్టు నుంచి 2017 డిసెంబర్ కల్లా గోదావరి జలాలు తెలంగాణ పొలాలకు తరలించవలసి వుందన్నారు. ఇరిగేషన్, రెవిన్యూ, అటవీ, విద్యుత్తు, గనులు తదితర ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో సమష్టిగా పనిచేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. భూసేకరణ పనులను మరింత వేగవంతం చేసి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చూడాలని కోరారు హరీష్ రావు.

ఇక మేడిగడ్డ బ్యారేజీ పనుల టెండర్లు రెండు వారాల్లో ఖ‌రారు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.  అన్నారం, సందిళ్ళ బ్యారేజీల పనులు నవంబర్ 15న ప్రారంభించాలని ఆదేశించారు హ‌రీష్ రావు.  ఈ మూడు బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్ ల పనులను కూడా ఏకకాలంలో, సమీకృతంగా చేపట్టాలని హరీశ్ రావు సూచించారు. కన్నెపల్లి పంప్ హౌజ్ పనులు ప్రారంభించినట్టు , కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో వారంలో అన్నారం పంపు హౌజ్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సుందిళ్ళ పనులకు నవంబర్ 15 డెడ్ లైను గా మంత్రి ఖరారు చేశారు.

కాగా ర‌బీ సీజ‌న్ స‌మీపిస్తుండంతో దానిపై కూడా దృష్టిపెట్టింది కేసీఆర్ గవర్నమెంట్.. రబీ కి చెరువుల కింద సాగు నీరివ్వాల‌ని అధికారుల‌ను మంత్రి హ‌రీష్ రావు ఆదేశించారు. అలాగే నీటి లభ్యతపై రైతులకు ముందే స్పష్టత ఇవ్వమ‌ని సూచించింది ప్ర‌భుత్వం. రబీ ప‌రిస్థితిపై గురువారం సెక్రటేరియట్ నుంచి జిల్లా కలెక్టర్ల తో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రబీ పంటకు సాగునీటి కార్యాచరణ ప్రణాళిక ను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. చెరువుల పరిధిలో సమావేశాలు పెట్టి నీటి లభ్యత పై శాస్త్రీయంగా అంచనా వేసి ఎన్ని రోజులు సాగునీరందించగలమో ముందుగానే రైతులకు స్పష్టత ఇవ్వాలని హరీశ్ రావు సూచించారు. మైనర్ ఇరిగేషన్ తో పాటు, మీడియం, మేజర్ ప్రాజెక్టుల కింద కూడా రబీ సాగు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలక్టర్లను కోరారు. ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ అత్యంత కీలకమని… దీనికి ప్రతి కలెక్టర్ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు హ‌రీష్ రావు.

మిషన్ కాకతీయ 3వ దశ కింద ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని  జిల్లా కలెక్టర్లను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. మిష‌న్ కాకతీయ మూడో ద‌శ‌ను, డిసెంబర్లో టెoడర్ల ప్రక్రియ పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు, మిష‌న్ కాక‌తీయ‌కు సంబంధించి అంశాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌త్యేక వాట్స‌ప్ గ్రూప్ ను కూడా క్రియేట్ చేయ‌బోతున్నారాయన.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>