Breaking News

జయలలిత మరణంపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు

jaya_doctor

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై మద్రాస్‌ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత మరణంపై మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందని, తనుకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యలింగం పేర్కొన్నారు. జయ మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తామేందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చేరినప్పడు ఆమె బాగానే ఆహారం తీసుకుంటున్నారని ప్రకటించారని గుర్తు చేశారు. జయ మరణం తర్వాతైనా వాస్తవాలు వెల్లడికావాలన్నారు. కేసును రెగ్యులర్‌ బెంచ్‌ కు న్యాయమూర్తి బదిలీ చేశారు.అరుంబాక్కంకు చెందిన జోసెఫ్‌ ఈ పిటిషన్‌ వేశారు. సెప్టెంబర్‌ 22న  జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే విషయాలు వెల్లడించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జయలలిత  మృతికి కారణాలు తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్‌ కోరారు.తొలుత జ్వరం కారణంగా జయను ఆస్పత్రిలో చేర్చారని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అయితే అది జరగలేదని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ అపోలో ఆస్పత్రి వారు బులిటెన్లు విడుదల చేశారన్నారు. జయ దేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లు తొలగించినట్లు గమనించారని, ఆమె దేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆస్పత్రి వర్గాలు ఈ రీతిలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోందని జోసెఫ్‌ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. జయ మృతిపై తనకు సందేహాలున్నాయని హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించారు. జయలలిత మృతిపై అప్పట్లోనే చాలామందికి చాలా సందేహాలు వచ్చాయి. ఆమె ఎడమ బుగ్గపై కనిపించిన నాలుగు రంధ్రాలు ఏంటనే విషయంతో పాటు విష ప్రయోగం జరిగి ఉండవచ్చంటూ అప్పట్లో సోషల్ మీడియాలోనూ, సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. తాజాగా జయ మృతిపై జస్టిస్ వైద్యనాథన్ వ్యక్తం చేసిన సందేహాలకు ఇవి కూడా కారణం అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎవరైనా మరణించినప్పుడు వారి మృతదేహాలు పాడవపోకుండా కొన్నిరోజుల పాటు ఉండేందుకు ఎమాల్మింగ్ చేస్తుంటారు. పలు రకాల రసాయనాలను శరీరంలోకి పంపించి మందులతో శరీరాన్ని శుద్ధి చేస్తారు. మృతదేహాంలోని రక్తాన్ని తొలగించి.. రసాయన మందును శరీరంలోకి పంపించడాన్నే ఎమాల్మింగ్ విధానం అంటారు. సూది ద్వారా మందును శరీరంలోకి పంపిస్తారు. ఆ సూదిని గజ్జల నుంచి లేదా మెడ వెనుక భాగంలో ఇస్తారు. అందువల్ల.. జయలలిత బుగ్గపై ఏర్పడిన నాలుగు రంధ్రాలకు కారణం ఎమాల్మింగ్ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక చివరి ప్రక్రియగా జయలలితకు చేసిన ఎక్మో చికిత్స వల్ల ఈ రంధ్రాలు ఏర్పడ్డాయా అని అనుకుంటే దానిపై అపోలో ఆసుపత్రి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఆమెకు గుండెపోటు వచ్చినప్పటి నుంచి ఎక్మో పద్ధతిలో చికిత్స చేశారు. దీంతో పాటు ఆమెకు మరేదైనా చికిత్స చేశారా అన్న విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ఇప్పుడు కూడా ఎందుకు బయటపెట్టడం లేదని చాలామంది బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.అదీగాక, జయ మరణం సంభవించిన వారం రోజుల్లో ఇదే (ఎక్మో యంత్రం ద్వారా) వైద్య విధానంలో బెంగళూరుకు చెందిన శ్రీనాథ్ అనే వ్యక్తి కోలుకున్నాడు. అలాంటప్పుడు, ఈ శ్రీనాథ్ కంటే మెరుగైన వైద్యం అందిన జయ ప్రాణాలు కోల్పోవడమేంటనే దిశగా కూడా చాలామందికి సందేహాలొచ్చాయి.ఇదిలా ఉంటే, జయ జీవించి ఉన్నప్పుడు ఆమెకు కొన్నేళ్ళుగా స్లో పాయిజన్ కలిపిన ఆహారం ఇచ్చినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో శశికళ పాత్ర కూడా ఉన్నట్లు కోయంబత్తూరుకు చెందిన కృష్ణమూర్తి అనే న్యాయవాది కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళతానని, జయ పేరుతో పార్టీ కూడా పెడతానని ఆయన అన్నారు. విషప్రయోగం నిజమే అయితే జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన అపోలో వైద్యులకు ఈ విష ప్రయోగం జరిగిందో.. లేదో స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాలేవీ బయటకు రాకుండా వారిపై ఏదైనా ఒత్తిడి పనిచేసిందా అనే కోణంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 ఇక మరో సందేహం ఏమిటంటే, జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడే మాజీ సీఎం కరుణానిధి కూడా మరో ఆసుపత్రిలో రెండు సార్లు ఆనారోగ్యంతో చేరారు. జయ దాదాపు 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండగా, కరుణ మొదటిసారి సుమారు పది రోజులు, తర్వాత నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. కరుణ కోలుకుంటుండగా, ఆ విషయాన్ని పార్టీ వర్గాలకు, అభిమానులకు తెలియజేసేందుకు డీఎంకే నేతలు ఫోటో విడుదల చేశారు. అయితే, దాదాపు 75 రోజుల పాటు చికిత్స పొందిన జయకు సంబంధించి ఒక్క ఫోటోను కూడా బయటకు రానివ్వలేదు. ఒక దశలో జయ పూర్తిగా కోలుకున్నారని, ఎప్పుడు ఇంటికెళ్ళాలో నిర్ణయించుకోవాల్సింది ఆమేనని కూడా ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. కానీ, కొద్దిరోజులకే అదే ఆస్పత్రిలో ఆమె కన్నుమూయడం ప్రస్తుత అనుమానాలకు బలం చేకుర్చుతోంది.జయ బుగ్గపై ఏర్పడిన నాలుగు రంధ్రాలు, ఈ విషప్రయోగం ఆరోపణలు, ఆమె పూర్తిగా కోలుకున్నారని చెప్పి మరణవార్త వినిపించడం ఏంటనేవి తెలియకుంటే జస్టిస్ వైద్యనాథన్ వ్యక్తం చేసిన అనుమానాలతో పాటు చాలామందికి కలిగిన సందేహాలు నివృత్తికాకుండా పోతాయి. జయలలితకు అందించిన చికిత్స వివరాలను బయటపెట్టకుండా ఇదే గోప్యత కొనసాగితే కుట్ర జరిగిందనే అనుమానం చరిత్రలో అలాగే నిలిచిపోతుందన్నది ఆమె అభిమానుల వ్యాఖ్య.
జయలలితకు ఎలాంటి చికిత్స అందిందో కేంద్రానికి తెలుసని, కానీ ఎందుకు గోప్యత పాటించిందో తెలియదని జస్టిస్ వైద్యనాథన్ కూడా అన్నారు. జయ మృతిపై జనవరి 9వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని తీవ్రంగా మందలించారు. జయలలిత మరణంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ వైద్యనాథన్‌, జస్టిస్‌ పార్తిబన్‌ ధర్మాసనం విచారించింది. తాను ఒక్కడినే ఈ పిటిషన్లను విచారించాల్సి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని జస్టిస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>