Breaking News, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,

రేపు ఢిల్లీ కి తెలంగాణ మంత్రి హరీష్ రావు

harish-ministers647x450

రేపు హస్తిన పర్యటనకు మంత్రి హరీష్ రావు

PMKSY సమావేశంలో పాల్గొననున్న హరీశ్ రావు .

ప్రాజెక్టుల పూర్తికి 7900 కోట్లు కోరనున్న మంత్రి .

FRBM తో సంబంధం లేకుండా అప్పు కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ :
రాష్ట్ర ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్ రావు బుధవారం ఉదయం ఢిల్లీ వెడుతున్నారు. కేంద్ర జలవనరులు, వ్యవసాయ శాఖల మంత్రుల తో ఆయన సమావేశమవుతారు. సాగునీటి ప్రాజెక్టులకు రావలసిన కేంద్ర నిధులు, మార్కెటింగ్ రంగంలో టిఎస్ సర్కారు అమలు చేస్తున్న సంస్కరణలు తదితర వ్య వహారాలపై మంత్రి కేంద్ర మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధి కారులతో భేటీ అవుతారు.

ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ( PMKSY) కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య తదితర అంశాలపై కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం ఉన్నత స్థాయి సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో ఛత్తి స్ గడ్, మహారాష్ట్ర , తెలంగాణ ఇరిగేషన్ మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్, అసోం, రాజస్థాన్,జమ్ము కశ్మీర్ రాష్ట్రాల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం కేంద్రంపై మరోసారి ఒత్తిడి తీసుకు రానున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాబార్డు అధికారులతో కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లో మంత్రి సమావేశం జరిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పోరేషన్ కు నాబార్డు నిధులు అందించాలని మంత్రి సూచించారు. PMKSY కి చెందిన 11 సాగునీటి ప్రాజెక్టులను ఈ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకు రానున్నట్టు చెప్పారు. FRBM తో నిమిత్తం లేకుండా నిధులివ్వాలని నాబార్డు బృందాన్ని మంత్రి కోరారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, ‘కాడా ‘ కమిషనర్ మల్సూర్ కేంద్రంతో ఇదివరకే చర్చించారని, కేంద్రం సానుకూలంగా స్పందించిందని హరీశ్ రావు గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కేంద్రం గుర్తించిన 99 పెండింగ్ ప్రాజెక్టులలో తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులున్నట్టు మంత్రి చెప్పారు. ఇందులో దేవాదుల, రాజీవ్ బీమా, ఎస్ఆర్ఎస్ పి రెండోదశ, నీల్వాయి, ర్యాలివాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కొమరం భీమ్, జగన్నాధ పూర్ పెదవాగు, గొల్లవాగు, వరద కాలువ ఉన్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దీర్ఘకాలిక సాగునీటి పారుదల నిధి నుంచి నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందించాలని మంత్రి కోరారు. FRBM పరిమితికి లోబడి ఇదివరకే వివిధ ప్రభుత్వ పధకాలకు రుణ సహాయం తీసుకున్నందున ఇప్పుడు 11 ప్రాజెక్టులకు FRBM పరిమితిలో అప్పు పొందడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నట్టు హరీశ్ రావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయడానికి గాను దీర్ఘకాలిక సాగునీటి నిధి (LTIF ) కింద కేంద్రం 20 వేల కోట్ల రూపాయలను కార్పస్ ఫండ్ గా సమకూర్చిందని ఆయన చెప్పారు. ప్రాధాన్యతా పరంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర జలవనరుల శాఖ, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ, నాబార్డు ల మధ్య గత సెప్టెంబర్ 6న ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని జాతీయ జలవనరుల టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు కూడా అయిన మంత్రి హరీశ్ రావు నాబార్డు బృందానికి తెలిపారు. త్రైపాక్షిక ఒప్పందం లో కుదిరిన వడ్డి రేట్ల ప్రకారమే కాళేశ్వరం కార్పొరేషన్ కు నిధులివ్వాలని మంత్రి కోరారు. కేంద్రం షెడ్యూల్ ప్రకారం మూడేళ్లలో ఈ 11 ప్రాజెక్టులు పూర్తి చేయవలసి ఉంది. ఇందుకుగాను 7900 కోట్ల నిధులు అవసరమని నాబార్డు బృందానికి మంత్రి వివరించారు. ఇంత భారీ మొత్తాలను మూడేళ్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పూచీ ఉంటున్నందున నాబార్డు ద్వారా కాళేశ్వరం కార్పోరేషన్ కు నిధులువిడుదల చేయాలని హరీశ్ రావు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>