Breaking News, దేశ అబివ్రుద్ది పధకాలు

స్వర్ణ దేవాలయంలో నరేంద్రుడు

img_20161203_234846

“6వ హార్ట్ ఆఫ్ ఆసియా-ఇస్తాంబుల్” సదస్సు ప్రారంభించేందుకు పంజాబ్‌లోని అమృత్‌సర్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అనూహ్యంగా అక్కడి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. కేవలం దర్శనం మాత్రమే కాదు, లంగర్ సేవ (అన్నదాన కార్యక్రమం)లోనూ పాల్గొని అక్కడివారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. 1984 ఘటన తర్వాత ఆయుధాలను ఆలయం లోపలకి అనుమతించడం లేదు. దీంతో ప్రధానికి భద్రత కల్పించడం కోసం అక్కడి భద్రతా సిబ్బంది ఒక వలయంగా ఏర్పడ్డారు. అమృత్‌సర్ చేరుకున్న వెంటనే నేరుగా ఆయన స్వర్ణ దేవాలయానికే దారి తీశారు. ఆయనతోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు – ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ బాదల్‌తోపాటు, అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అస్రఫ్ ఘనీ కూడా ఉన్నారు.
img_20161203_234910

స్వర్ణ దేవాలయం పరిసరాల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను గమనిస్తూ ఆయన లోపలికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ భక్తులతో కరచాలనం చేశారు. స్వర్ణ దేవాయలం చుట్టూ ఉన్న సరోవరం చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రదక్షిణను కేవలం 10 నిముషాల్లోనే పూర్తి చేసుకున్నారు. అటు నుంచి దేవాలయం లోపలికి క్యూ లైన్ పక్క నుంచి ప్రత్యేక మార్గంలో వెళ్తుండగా, ఆయన్ను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఆయనతో కరచాలనం చేయడానికి ప్రయత్నించారు. అందరితో నవ్వుతూ కరచాలనం చేసిన ప్రధానికి కొందరికి సెల్ఫీ అవకాశాన్ని కూడా కల్పించారు. అనంతరం సిక్కుల పవిత్ర గ్రంధం ముందు భక్తితో సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత స్వర్ణ దేవాలయ నిర్వాహకులు సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ విజిటర్స్ బుక్‌లో ప్రధాని రాశారు. గుజరాతీలో “గురు భూమికో శత్ శత్ ప్రణామ్” (గురుభూమికి శత శత నమస్కారములు) అని రాశారు. ఈ అనూహ్య పర్యటన వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని కొందరు నేతలు గుసగుసలాడుకున్నారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ కూడా ఒకటి.

img_20161203_234849

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>