Breaking News

బ్రాండ్‌లలో అతిపెద్ద బ్రాండ్‌ ‘మేకిన్ ఇండియా’ పథకమే…….!

modi_story

రెండురోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌కు ఇప్పటివరకు ఉన్న బ్రాండ్‌లలో అతిపెద్ద బ్రాండ్‌ ‘మేకిన్ ఇండియా’ పథకమేనని అన్నారు. ఈ పథకం యువతలోని శక్తిని వెలికితీసుకొస్తున్న తీరు చాలా ముదావహంగా ఉందని అన్నారు. భారత్ ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్ లో ఆరో అతిపెద్ద దేశంగా ఉందని గుర్తుచేశారు.ప్రతి నిరుపేదకు సొంతింటిని కట్టించాలని, ప్రతి వ్యక్తికి ఉద్యోగాన్ని కల్పించాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఎన్నడూలేనంత అత్యధికస్థాయిలో ఇప్పుడు దేశంలోకి ఎఫ్‌డీఐలు వస్తున్నాయని, క్యాపిటల్ గూడ్స్ విషయంలో ఆసియా-పసిఫిక్ లో భారతే అగ్రస్థానంలో ఉందని మోదీ అన్నారు. పెట్టుబడులపై రిటర్న్స్ ఇవ్వడంలో ప్రపంచదేశాలన్నింటినీ భారత్ వెనుకకు నెట్టేసిందని గర్వంగా చెప్పారు.  ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నోబెల్ సిరీస్ ఎగ్జిబిషన్ లో భాగంగా తొమ్మిది మంది నోబెల్ గ్రహీతల చర్చను ప్రారంభించారు.ఆర్థిక సంస్కరణలు కొనసాగించేందుకు తమ ప్రభుత్వం బలంగా కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలోనూ తాము అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. గ్లోబల్ ఎకానమీకి ఇండియా ఆశాకిరణమని తెలిపారు. మంగళవారంనాడిక్కడ జరిగిన వైబ్రంట్ గుజరాత్ ప్రపంచ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ, భారత వాణిజ్య స్ఫూర్తికి ప్రతినిధులుగా నిలిచిన మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన గడ్డ గుజరాత్ అని కొనియాడారు. గత రెండున్నరేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో వేగవంతమైన ఫలితాలను సాధించడం సాధ్యమేనని నిరూపించామని, సుపరిపాలనకు బాటలు వేశామన్నారు. డిజిటల్ డెక్నాలజీ దిశగా అడుగులు వేశామని, ఇ-గవర్నరెన్స్ ద్వారా చాలా తేలికైన, సమర్ధవంతమైన పాలన అందించగలమని తాను పదేపదే చెబుతున్నానని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియాలోనే అతి పెద్ద బ్రాండ్ అని చెప్పారు. సదస్సులో పాల్గొన్న జపాన్, కెనడా సహా భాగస్వామ్య దేశాలు, ఇతర సంస్థలకు ఈ సందర్భంగా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>