Breaking News

బ్యాంకు అకౌంట్లలోకి వెల్లువెత్తిన నల్లధనంపై ఆదాయపన్ను శాఖ దృష్టి

jandan

నోట్లరద్దు నిర్ణయం అమల్లోకి వచ్చాక బ్యాంకు అకౌంట్లలోకి వెల్లువెత్తిన నల్లధనంపై ఆదాయపన్ను శాఖ దృష్టిపెట్టింది. పరిమితికి మించి అనుమానాస్పదంగా డబ్బుల లావాదేవీలు జరిగిన అకౌంట్లను పరిశీలిస్తోంది. ఢిల్లీలో వ్యాపార సంస్థలు, చార్టెడ్‌ అకౌంటెంట్లు,  నిపుణులతో సమావేశమైన ఐటీ శాఖ కమిషనర్‌ ఏకే చౌహాన్‌.. దీనిపై వివరణ ఇచ్చారు.ఇప్పటికే పలు అకౌంట్లలోకి లెక్కలో చూపని ధనాన్ని వేసిన వారు.. ప్రధాన మంత్రి గ్రామీణ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద పన్ను చెల్లించాలన్నారు. లేకుంటే గడువు ముగిశాక విచారణలో బయటపడ్డ నల్లధన కుబేరులకు కఠిన పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. ‘బ్యాంకు అకౌంట్లను, డిపాజిట్లను పరిశీలిస్తున్నాం. అందుకే పీఎంజీకేవై పథకాన్ని వినియోగించుకోవాలనుకునేవారు నిశ్చింతగా ఉండొద్దని చెబుతున్నా. ఆర్థిక ఇంటెలిజెన్స్‌ యూనిట్, ఇతర సంస్థలిచ్చే వివరాలను విశ్లేషిస్తున్నాం. అంతకుముందే పీఎంజీకేవై పథకం ప్రకారం పన్ను చెల్లించండి. ఒకసారి పథకం గడువు ముగిస్తే.. ఎగవేతదారులకు కష్టాలు తప్పవు’ అని చౌహాన్‌ హెచ్చరించారు.పీఎంజీకేవై అనేది ‘ఆదాయ వెల్లడి పథకం పార్ట్‌ –2’ అనుకోవద్దని.. దీని ఉద్దేశాలు పూర్తిగా వేరని స్పష్టం చేశారు. నల్లధనం నుంచి బయటకు వచ్చేందుకు ఇదే చివరి అవకాశమన్నారు.నల్లకుబేరుడు, ఢిల్లీ లాయర్ రోహిత్ టాండన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వారం రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. రూ. 76 కోట్ల నల్లధనాన్ని వైట్‌గా మార్చుకున్నట్లు టాండన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన నివాసంపై దాడులు జరిపిన అధికారులు..మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాండన్‌తోపాటు వ్యాపారవేత్త పరాస్‌మాల్ లోధాను సైయితం ఈడీ అధికారులు ప్రశ్నించారు.

పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగం. ఈ ప్రసంగానికి కొన్ని గంటల ముందే అంటే సాయంత్రం 5.30 గంటలకే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించేసిందట. అయితే ఈ విషయానికి ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది అనుకూలించారో మాత్రం ఆర్బీఐ రికార్డు చేయలేదు. సమాచార హక్కు చట్టం కింద కోరిన ప్రశ్నలకు సమాధానంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించిందని బ్లూమ్బర్గ్ న్యూస్ రిపోర్టు చేసింది. నవంబర్ ఎనిమిదిన బోర్డు మీటింగ్ నిర్వహించిన ఆర్బీఐ సాయంత్రం 5.30 గంటలకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించిందని ఆర్టీఐలో వెల్లడైంది. అనంతరం ప్రధాని రాత్రి ప్రసంగంలో తెలిపారు. బ్యాంకు బోర్డు మీటింగ్లో గవర్నర్ ఉర్జిత్ పటేల్, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు. ఆర్. గాంధీ, ఎస్ఎస్ ముంద్రా, వీఎస్ విశ్వనాథన్లతో పాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ వంటి పలువురు ప్రముఖులున్నారు. అయితే కరెన్సీ రద్దుతో  ఏర్పడే నగదు కొరతకు  ఆర్బీఐ ఎలాంటి చర్యలు ప్లాన్స్ సిద్ధం చేసుకుందో ఆర్బీఐ తెలుపలేదు. రోజుకు ఎన్ని కొత్త రూ.500, రూ.2000 నోట్లు ప్రింట్ చేస్తున్నారనే దానిపై కూడా ఆర్బీఐ సమాధానం చెప్పలేదు.పెద్ద నోట్లు రద్దయి 50 రోజులు గడుస్తున్నా ఇంకా నగదు కొరత సమస్య వెంటాడుతూనే ఉంది. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరీక్షిస్తూనే ఉన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని నిరుపయోగంగా మార్చేస్తూ పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పలు పరిణామాల్లో ఆర్బీఐ పలు సార్లు తడబడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆర్బీఐ పలు విమర్శలు ఎదుర్కొంటుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో సెంట్రల్ బ్యాంకు స్వతంత్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>