Breaking News

పన్ను ఎగవేతలపై ముమ్మరంగా దర్యాప్తు

banka

రూ.  500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకులలో నమోదైన డిపాజిట్లపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) నజర్ పెట్టింది. నోట్ల ద్దు తర్వాత 50రోజుల గడువులోగా డిపాజిట్ అయిన మొత్తాలను సమగ్రం విశ్లేషిస్తోంది. దేశవ్యాప్తంగా డిపాజిట్ అయిన పాత నగదులో రూ. 3 నుంచి నాలుగు లక్షల కోట్లు పన్ను ఎగ్గొట్టిన ధనం ఉండవచ్చునని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఈ నాలుగు లక్షల కోట్ల డిపాజిట్ల వివరాలు పరిశీలించి.. ఆయా డిపాజిటర్లకు నోటీసులు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినటు ఐటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.’నోట్ల రద్దు తర్వాత దాదాపు 60 లక్షల బ్యాంకు ఖాతాలలో రూ. 2 లక్షలకు మించి డిపాజిట్లు నమోదయ్యాయి. వీటి వివరాలన్నీ విశ్లేషించగా.. నిశితంగా ఈ పరిశీలంచగా.. ఈ 60 లక్షల ఖాతాలలో రూ. 7.34 లక్షల నగదు డిపాజిట్ అయినట్టు తేలింది. ఇక ఈశాన్య రాష్ట్రాలలోని వివిధ బ్యాంకు ఖాతాలలో ఏకంగా రూ. 10,700 కోట్ల అనుమానిత డిపాజిట్లు నమోదైనట్టు ఐటీ గుర్తించింది. సహకార బ్యాంకులలో డిపాజిట్ అయిన రూ. 16వేల కోట్లపైనా ఐటీ, ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు’ అని ఆయన వివరించారు. ఇక ఎప్పుడూ నిష్క్రియాత్మకంగా ఉండే ఖాతాలలో ఏకంగా రూ. 25వేల కోట్ల డిపాజిట్ అయ్యాయని ఆయన చెప్పారు. ఇక, నవంబర్ 8న జరిగిన నోట్ల రద్దు తర్వాత ఏకంగా రూ. 80వేల కోట్లు రుణాలు బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరిగిందని ఆ అధికారి పీటీఐకి తెలిపారు.కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్లలో పది శాతం వెనక్కి రాకపోవచ్చని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ డిబ్రోయ్ ఈమేరకు అంచనా వేశారు. రద్దైన పాత నోట్లు సుమారు రూ.16 లక్షల కోట్లుగా భావిస్తే, ఇందులో పది శాతమైన రూ.1.6 లక్షల కోట్లు వెనక్కి వచ్చే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయప్డడారు. పన్నులు, జరీమానాలకు భయపడి కొందరు పాత నోట్లను బ్యాంకులో జమ చేయక వాటిని ధ్వంసం చేసి ఉంటారని ఆయన అనుమానిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటన నాటికి సుమారు రూ.15.4 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1000 నోట్లు చెలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం నగదులో ఇది 86 శాతం. అయితే డిసెంబర్ 10 నాటికి సుమారు రూ.12.44 కోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ ప్రకటించింది.రద్దైన నోట్ల జమకు విధించిన డిసెంబర్ 30 గడువు ముగిసిన నాటికి సుమారు రూ.14.97 లక్షల కోట్లు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది 97 శాతం మేర ఉండటంతో వాస్తవ నగదు డిపాజిట్లను సరి చూసుకోవాల్సి ఉందని ఆర్బీఐ పేర్కొంది. ఎన్నారైలు, ఆర్బీఐ శాఖల్లో జమకు మార్చి 31 వరకు గడువుంది. అయినప్పటికీ రద్దైన పెద్ద నోట్లతో పది శాతం వెనక్కి రాకపోవచ్చని ఆర్థిక నిఫుణులు అంచనా వేస్తున్నారు.పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారతీయ రిజర్వు బ్యాంకుదని కేంద్ర ప్రభుత్వం అంటూ ఉంటే, కాదు కాదు కేంద్రమే మాకు సలహా ఇచ్చిందని ఆర్బీఐ అంటోంది. ఇదిలావుండగా అత్యధిక విలువగల కరెన్సీ నోట్లను జారీ చేయాలన్న ఆలోచన తమకే వచ్చిందని ఆర్బీఐ చెప్తోంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.5,000, రూ.10,000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలని తామే సలహా ఇచ్చామని పేర్కొంది. దీనివల్ల చెల్లింపులు సులువవుతాయని, కరెన్సీ లాజిస్టిక్స్‌ను సక్రమంగా నిర్వహించవచ్చునని తెలిపింది.దీనిపై ప్రభుత్వం చర్చోపచర్చలు జరిపిందని, చివరికి 2016 మే 18న రూ.2000 నోట్లను ప్రవేశపెట్టేందుకు సూత్రప్రాయ నిర్ణయాన్ని తెలిపిందని వివరించింది. పర్యవసానంగా ఆర్బీఐ 2016 మే 27న ప్రభుత్వానికి చేసిన సిఫారసులో కొత్త రూపం, పరిమాణం, రంగులు, థీమ్స్‌తో రూ.2000 నోటును ప్రవేశపెట్టాలని పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సిఫారసుకు ప్రభుత్వం అదే ఏడాది జూన్ 7న ఆమోదం తెలిపిందని పేర్కొంది. అనంతరం రూ.2,000 నోట్లను ముద్రించాలని ముద్రణాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. కాంగ్రెస్ నేత ఎం. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక శాఖ పార్లమెంటరీ సంఘానికి గత నెల 22న ఆర్బీఐ సమర్పించిన నివేదికలో ఈ ఆసక్తికర విషయాలు ఉన్నాయి.రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న ప్రకటించే సమయానికి ఆర్బీఐ, ఇతర కరెన్సీ ఛెస్ట్‌ల వద్ద ఉన్న రూ.2,000 నోట్ల విలువ కేవలం రూ.94,660 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. రద్దయిన కరెన్సీ నోట్ల విలువ రూ.15 లక్షల కోట్లు కాగా, అందులో కేవలం 6 శాతం మాత్రమే రూ.2,000 నోట్ల రూపంలో అప్పటికి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.రూ.5,343 కోట్లు! పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడులు, సోదాల్లో గుర్తించిన లెక్కల్లో చూపని ఆదాయమిది. దేశవ్యాప్తంగా 1,156 చోట్ల తనిఖీలు నిర్వహించామని, దాదాపు 5,184 మందికి నోటీసులు జారీ చేశామని ఐటీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా రూ.609.39 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, ఇందులో రూ. 114.1 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉన్నాయని చెప్పాయి. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం కొత్త 2 వేల నోట్ల రూపంలో ఉండటం గమనార్హం

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>