Breaking News

ఐఆర్‌సీటీసీ కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి

irctcapp
ఐఆర్‌సీటీసీ కొత్త మొబైల్ యాప్‌ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ప్రారంభించారు. ప్రయాణికులు ఇక సులువుగా సెల్‌ఫోన్ల నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఆర్‌సీటీసీ కనెక్ట్‌ యాప్‌ను ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌గా అప్ డేట్ చేసినట్లు వివరించారు.ఆండ్రాయిడ్ ఆధారిత ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్‌లో పిన్ సెక్యూరిటీతో పాటు ఐఆర్‌సీటీసీ ఈ వాలెట్‌తో అనుసంధానం చేశారు. అంతేగాక 40 బ్యాంకులతో నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు పేటిఎం, పేయూ, మొబివిక్ వంటి పేమెంట్ గేట్లతో ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఎయిర్, ఫుడ్ ఆన్ ట్రాక్ మొబైల్ యాప్స్ కూడా ఈ కొత్త యాప్‌తో ఇంటర్ కనెక్ట్‌గా ఉంటాయి.ఇకపై ప్రయాణికులు రైల్వే టికెట్ బుకింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త టికెటింగ్ యాప్‌ను త్వరలోనే లాంచ్ చేసేందుకు రైత్వేశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న టిక్కెట్ బుకింగ్ యాప్‌కు మరిన్ని కొత్త ఫీచర్లను కలుపుతూ ఈ యాప్‌ను ఐఆర్‌సీటీసీ ఆవిష్కరించనుంది.లేటెస్ట్ టెక్నాలజీతో ఈ యాప్‌ను రూపొందిస్తున్నామని, మరింత వేగవంతంగా, సులభతరంగా ఐఆర్‌సీటీసీ ద్వారా ఇక టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు.రైలు ప్ర‌యాణానికి రిజ‌ర్వేష‌న్ అంటే ఒకప్పుడు రిజ‌ర్వేష‌న్ కౌంట‌ర్ల ముందు గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్ష‌ణ‌. ఆన్‌లైన్ అందుబాటులోకి వ‌చ్చాక ఈ నిరీక్ష‌ణ బాగా త‌గ్గింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుంటే చాలు.. ప్ర‌పంచంలో ఏ మూల నుంచైనా మ‌న ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ తోపాటు ఐఆర్‌సీటీసీ క‌నెక్ట్ అనే మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు బ్యాంకులు, మొబైల్ వాలెట్లు కూడా ట్రైన్ రిజ‌ర్వేష‌న్ సేవ‌లు అందిస్తున్నాయి. అయితే వీటిలో నుంచి రైలు టికెట్ బుక్ చేసుకోవాల‌న్నా ఐఆర్‌సీటీసీ లాగిన్ ఉండాల్సిందే.   ఉప‌యోగాలేంటి? * ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పోల్చితే ఈ యాప్‌ల‌లో నుంచి వినియోగం సులువుగా ఉంటుంది. * టికెట్ బుకింగ్ పై కూడా కొన్నిసార్లు క్యాష్‌బాక్ లేదా డిస్కౌంట్లు కూడా ల‌భ్య‌మ‌వుతాయి. *ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసిన‌ప్పుడు పేమెంట్ గేట్‌వేకు వెళ్ల‌డానికి కొంత స‌మ‌యం తీసుకుంటుంది. చాలామందికి ఆ కాస్త స‌మ‌యంలోనే సీట్లు నిండిపోయి రిజ‌ర్వేష‌న్ దొర‌క‌దు. ఈ యాప్‌లే పేమెంట్‌వి కాబ‌ట్టి వాలెట్‌లో సొమ్ముంటే చాలు నేరుగా పే చేసేయొచ్చు. టైం క‌లిసొచ్చి రిజ‌ర్వేష‌న్ మిస్ అయ్యే ఇబ్బంది త‌గ్గుతుంది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>