Breaking News

పాకిస్థాన్ సైన్యం భారతీయులను చంపితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది

army-at-loc

పాకిస్థాన్ సైన్యం భారతీయులను చంపితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత శిబిరాలపై దాడి చేస్తున్నందుకు ప్రతిచర్యగా, బీఎస్ఎఫ్ జవాన్లు 14 పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడాన్ని గుర్తుచేస్తూ, ఆ దేశానికి ఇది ఓ హెచ్చరిక అని జైట్లీ చెప్పారు.పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని 60 సార్లు ఉల్లంఘించింది. నిత్యం భారత్ శిబిరాలపై కాల్పులు జరుపుతోంది. ఇందుకు భారత సైన్యం దీటుగా స్పందిస్తోంది. భారత జవాన్ల కాల్పుల్లో భారీ ఎత్తున పాక్ రేంజర్లు చనిపోయారు. సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. శాంతంగా ఉండటం వల్ల నష్టపోయామని, ఇకమీదట ఆ పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. పాక్ దాడులకు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తుందని చెప్పారు. పాకిస్థాన్లో అంతర్గత పరిస్థితి అస్థిరంగా ఉందని చెప్పారు.పాకిస్థాన్‌ మళ్లీ రెచ్చిపోయింది. ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండానే తుపాకులు, మోర్టారు బాంబులతో విరుచుకుపడింది. భారతపై ప్రతీకారంతో రగిలిపోతున్న దాయాది.. సరిహద్దు గ్రామాలపై గుళ్ల వర్షం కురిపించింది. జమ్మూ కశ్మీరులోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సాంబా, జమ్ము, పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో సైనిక శిబిరాలు, శివారు గ్రామాలపై మొదటిసారిగా 82 ఎంఎం, 120 ఎంఎం భారీ మోర్టారు బాంబులను ప్రయోగించింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు మరణించారు. 22 మంది గాయపడ్డారు. గత రెండు దశాబ్దాల్లో సరిహద్దుల్లో ఒకేరోజున ఇంతమంది పౌరులు చనిపోవడం ఇదే మొదటిసారి. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే. రామ్‌గఢ్‌ సెక్టార్లో ఐదేళ్ల చిన్నారులు రేషబ్‌, అభి, 19 ఏళ్ల రవీందర్‌ కౌర్‌ మరణించారు. రామ్‌గడ్‌ సెక్టార్లో ఐదుగురు మరణించారని, తొమ్మిదిమంది గాయపడ్డారని సాంబా డిప్యూటీ కమిషనర్‌ షీతల్‌ నందా తెలిపారు. గుళ్ల వర్షం కురుస్తుండడంతో షాక్‌కు గురై మరొక వ్యక్తి మరణించారని తెలిపారు. ఒకవైపు, మోర్టారు బాంబులను ప్రయోగిస్తూనే, మరోవైపు తుపాకులతో కాల్పులు జరిపారని వివరించారు. రాజౌరీ జిల్లాలో ఇద్దరు మహిళలు మరణించారు. దాంతో, భారత దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్థానీ సైనికులు మరణించారు. 14 పాకిస్థాన్‌ స్థావరాలు ధ్వంసమయ్యాయి. కాగా, జమ్మూ కశ్మీరు గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరా మంగళవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కాగా, సరిహద్దు కాల్పులపై రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత దోవల్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌ సింగ్‌తో కలిసి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సమీక్షించారు.

పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత సర్జికల్‌ దాడులు చేసిన సెప్టెంబరు 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు నెల రోజుల్లోనే పాకిస్థాన్‌ 60 సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ కాల్పుల్లో 12 మంది పౌరులుసహా 18 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. సర్జికల్‌ దాడులు జరిగినప్పటి నుంచీ భారతలోకి సాయుధ ఉగ్రవాదులను చొప్పించడానికి పాకిస్థాన్‌ ప్రయత్నిస్తూనే ఉంది. దీపావళి రోజు రాత్రి కూడా ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. వారిని బీఎ్‌సఎఫ్‌ దళాలు పట్టుకున్నాయి. ఇందుకు సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుపుతూనే ఉంది. వాటికి బీఎ్‌సఎఫ్‌ దీటుగా బదులిస్తోంది.ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండానే సరిహద్దుల్లో ‘కాల్పుల విరమణ ఉల్లంఘన’లకు పాల్పడుతున్నారంటూ భారత డిప్యూటీ హై కమిషనర్‌ జేపీ సింగ్‌ను పిలిచి పాకిస్థాన్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈమేరకు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 31న భారత జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు మరణించారని, ఈ ఘటనను పాక్‌ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని హితవు పలికింది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>