దేశ అబివ్రుద్ది పధకాలు, పార్లమెంటు & దేశ రాజకీయలు

ఇకపై వేలిముద్రే అందరికీ గుర్తింపుగా మారబోతోంది

533862-modi-bhim

 

న్యూఢిల్లీ:  ఇకపై వేలిముద్రే అందరికీ గుర్తింపుగా మారబోతోంది. దాంతోనే అన్ని లావాదేవీలు జరగనున్నాయి. రూ.1,200 విలువైన ఫీచర్‌ ఫోన్‌ అయినా భీమ్‌ యాప్‌ను వినియోగించుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్‌ అవసరం లేదు. వేలిముద్రతోనే పనిచేస్తుంది. ఒకప్పుడు నిరక్షరాస్యులను అంగూఠా ఛాప్‌ (వేలిముద్రగాళ్లు) అనేవారు. కానీ కాలం మారింది. మీ అంగూఠానే మీ బ్యాంకు అకౌంట్, మీ గుర్తింపు.  ప్రధాని మోదీ

మరో 2 వారాల్లో ప్రారంభమయ్యే ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ చెల్లింపుల విధానం ద్వారా ఇది సాధ్యం కానుంది. ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ స్థానంలో ఈవీఎంలను సమర్థవంతంగా ఉపయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మన దేశ సామాన్యులు.. ఈ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్‌ లావాదేవీలు జరిపి, మరోసారి ఆ ఘనత సాధించగలరు’ అంటూ భవిష్యత్‌ భారత డిజిటల్‌ ముఖచిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కళ్లకు గట్టారు. దేశ రాజధానిలో జరిగిన డిజిధన్‌ మేళాలో శుక్రవారం అంబేడ్కర్‌ పేరుతో ఆధార్‌ ఆధారిత మొబైల్‌ ఈ వ్యాలెట్‌ యాప్‌ ‘భీమ్‌’(భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ)ను ఆయన ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ కర్త, ఆర్థికవేత్త డాక్టర్‌ భీమ్‌ రావు అంబేడ్కర్‌ పేరిట ఆవిష్కరించిన ఈ యాప్‌ ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరో 2 వారాల్లో వేలిముద్రలతో చెల్లింపు విధానాన్ని తీసుకొస్తా మన్నారు. ఫోన్, ఇంటర్నెట్‌ లేకుండా భద్రత మైన లావాదేవీ జరిగే అవకాశాన్ని కల్పించా లని చాలా రోజులుగా ఆలోచిస్తున్నామని మోదీ తెలిపారు. ‘స్మార్ట్‌ ఫోన్‌ అయినా.. వెయ్యి, రూ.1200 విలువైన ఫీచర్‌ ఫోన్‌ అయినా భీమ్‌ యాప్‌ను వినియోగించు కోవచ్చు. దీనికి ఇంటర్నెట్‌ అవసరం లేదు. వేలిముద్రతోనే పనిచేస్తుంది. ఒకప్పుడు నిరక్ష రాస్యులను అంగూఠా ఛాప్‌ (వేలిముద్రగాళ్లు) అనేవారు. కానీ కాలం మారింది. మీ అంగూ ఠానే మీ బ్యాంకు అకౌంట్, మీ గుర్తింపు’అని మోదీ అన్నారు. భీమ్‌ యాప్‌ను వినియోగిం చడం చాలా సులభమన్నారు. ఇప్పటికే 100 కోట్ల మంది దగ్గర ఆధార్‌ కార్డ్‌లు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇంతమంది ఆధార్‌ ఆధారిత యాప్‌ ద్వారా లావాదేవీలు జరిపితే అది చరిత్ర సృష్టిస్తుందన్నారు. భారత్‌లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నా ఎన్నికల్లో ఈవీఎంలను సమర్థవంతంగా వినియోగించి నందుకు ప్రపంచం ఆశ్చర్యపోయిందని.. ఇప్పుడు ఈ కొత్త సాంకేతికను వినియోగించు కోవటమూ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతుందన్నారు.  దేశ ప్రజలందరు కూడా బీం ఆప్ ద్వార లవదేవిలి జరపాలని కేంద్రం కోరింది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>