దేశ అబివ్రుద్ది పధకాలు

కరంట్ కనక్షన్ నూట పాతిక కే

John Hurren (L) and andy Judd (R) EDF emloyes from Kelsale depot, working on a ABC conductor low voltage at Benhall lodge near Ipswich 10 October 2003.
AFP PHOTO Nicolas ASFOURI.
John Hurren (L) and andy Judd (R) EDF emloyes from Kelsale depot, working on a ABC conductor low voltage at Benhall lodge near Ipswich 10 October 2003. AFP PHOTO Nicolas ASFOURI.

గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన (గ్రామీణ విద్యుదీకరణ) పథకం ద్వారా రూ.125లకే కనెక్షన్ ఇవ్వనుంది. కరెంట్ స్తంభాలు, సర్వీస్ వైరు, మీటరు అన్నీ విద్యుత్ శాఖ భరిస్తుంది. కనెక్షన్ తీసుకున్న వారు 240వాట్స్ వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అంతకు మించితే బిల్లు చెల్సించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఈ నెలలో అమలు చేసేందుకు విద్యుత్ అధికారులు టెండర్లు పూర్తి చేశారు. లబ్ధిదారుల ఎంపికను కూడా పారదర్శకంగా నిర్వహించనున్నారు. పథకం అమలుకుగాను ఉమ్మడి జిల్లాకు రూ.104కోట్లు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద ప్రజల కోసం దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన (గ్రామీణ విద్యుద్దీకరణ) పథకాన్ని ఈ నెలలో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టెండర్లు ప్రక్రియ జరుగుతుండగా త్వరలో పథకం అమలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా స్తంభాలు, సర్వీసు వైరు, మీటరు, మెయిన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు స్తంభాలు పాతేపనిని కాంట్రాక్టర్లకు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలను విద్యుత్ అధికారులు గుర్తిస్తారు. వారి పేరిట గతంలో మీటర్లు ఉన్నాయా? ఉంటే బకాయిలు ఉన్నాయా?అనే విషయాలపై ఆరా తీస్తారు. అన్నీ పరిశీలించాక వారి వద్ద రూ. 125 తీసుకొని విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తారు. అనంతరం విద్యుత్ అధికారుల దగ్గర ఉన్న దరఖాస్తు నింపి, ఆధార్ కార్డు, ఇంటి పన్ను జీరాక్స్ అందజేస్తే కనెక్షన్ ఇస్తారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>