దేశ అబివ్రుద్ది పధకాలు

డిజిటల్ నాలెడ్జ్ పెంచుకోండి

e1-f

అవినీతి, నల్లధనం నిర్మూలన కోసమే ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దేశం మరో దశలోకి మారుతున్న సమయంలో ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తప్పనిసరని అభిప్రాయపడ్డారు. సంపద కొద్దిమంది వద్దే ఉందని.. పన్ను ఎగవేతదారులను సక్రమ దారిలో ఉంచితే పేదలు అభివృద్ధి చెందుతారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు చేయాల్సి అవసరం ఉందన్నారు. భారత్‌ వెలిగిపోతోందని ప్రధాని మోదీ…. వెంకయ్యనాయుడు చెప్పడం లేదని… రేటింగ్‌ సంస్థల గణాంకాలే వెల్లడిస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. బినామీ ఆస్తులపైనా కేంద్రం దృష్టి సారించనుందని తెలిపారు. కొత్తకొత్త ఆవిష్కరణలకు నాంది పలకాల్సిన అవసరముందని, వ్యవసాయరంగంపై వినూత్నంగా ఆలోచించాలన్నారు. సాంకేతిక వినియోగంపై దృష్టి పెట్టాలని, సాంకేతికత విషయంలో అందరికంటే మనం ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. భద్రత కోసం నిఘాకు డ్రోన్‌ కెమెరాలు వినియోగిస్తున్నామని, పోలవరం పనులన్నీ సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో పర్యవేక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పుష్కరాల కోసం తక్కువ ఖర్చుతో మరుగుదొడ్లు నిర్మించామని, గ్రామాలన్నీ ఆకర్షణీయంగా మారితేనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం: నగరంలో నిర్వహించిన 20వ జాతీయ ఈ -గవర్నెన్స్‌ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్రసింగ్, సుజనా చౌదరితోపాటు రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ హరిబాబు, అధికారులు పాల్గొన్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>