దేశ అబివ్రుద్ది పధకాలు

రైల్వేలకి ప్రత్యేక బ్రాండింగ్

indian-railway-logo

రైల్వేలకు ఆదాయం తెచ్చే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం… కార్పొరేట్ బ్రాండింగ్ ఇచ్చే పనిలో పడింది. యూపీఏ ప్రభుత్వంలోనే దీనిపై ప్రణాళికలు వేసినా… అవి పూర్తిస్థాయిలోకి రాలేదు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిపై దృష్టిపెట్టారు. వాటికి మరింత మెరుగులుదిద్ది… ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రెయిన్ మొత్తాన్ని కూడా ప్రకటనల కోసం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రకటనల కోసం టెండర్లను పిలవనున్నారు. ఈ ప్రకటనల వ్యాపారం శతాబ్ది, రాజధాని ఎక్స్ ప్రెస్ లతోనే ప్రారంభించనున్నారు. పెప్సీ రాజధాని.. కోక్ శతాబ్ది.. ట్రెయిన్ ల పేర్లు గా మారిపోతున్నాయి.. అయితే వాటికి కార్పొరేట్ లుక్ ఇచ్చారంతే. రైల్వేకి ఆదాయం పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది రైల్వే శాఖ. ప్రయాణికులపై చార్జీల భారం వెయ్యకుండా… ప్రకటనల రూపంలోనే ఆ ఆదాయాన్ని పొందే ఆలోచనల్లో ఉంది. దీనికోసం భారీ ప్రణాళికనే వేశారు రైల్వే అధికారులు. కార్పొరేట్ ప్రకటనల కోసం భారీ మొత్తంలో ఆయా కంపెనీలకు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు దీనిపై ఇప్పటికే కేంద్రంతో చర్చలు పూర్తి చేశారు. కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు పూర్తి అయితే వచ్చే వారమే దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశముంది. దీంతో పాటు వినైల్ బోర్డ్స్ అడ్వర్టైజ్ మెంట్ లు, స్టేషన్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఫ్లాట్ ఫామ్స్ లలో పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చెయ్యడం, ట్రైన్లు, లెవల్ క్రాసింగ్ ఏరియాల్లో ప్రకటనలకు అవకాశాలు ఇవ్వనున్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>