పార్లమెంటు & దేశ రాజకీయలు

జయలలిత మేనకోడలు జే. దీపాకుమార్‌ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు

1481197203-1981

 

జయలలిత మేనకోడలు జే. దీపాకుమార్‌ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు జే. దీపాకుమార్‌ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే తాను సొంతంగా పార్టీ పెడుతున్నానని, అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు తనకు అండగా ఉంటారనే విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు. దివంగత నేత ఎంజీఆర్‌ వారసత్వం తనదేనని ఆమె శనివారం తన నివాసం ఎదుట పెద్ద ఎత్తున గుమిగూడిన మద్దతుదారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. జయలలలిత వారసురాలు దీపాకుమారేనంటూ తమిళనాడు అంతటా ఆమె మద్దతుదారులు కటౌట్లు, బ్యానర్లతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన క్యాడర్‌ శాంతియుతంగా వేచి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 17న అన్నాడీఎంకే స్థాపకుడు ఎంజీఆర్‌ శతజయంతి సందర్భంగా తామంతా కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిద్దామని మద్దతుదారులకు సూచించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘మేం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తాం’ అని ఆమె అన్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>