యువతకు స్ఫూర్తి చైతన్య దీప్తి వివేకానంద

swami-vivekananda-great-philosopher

 

“బలమే జీవనము బలహీనతే మరణం” అన్న స్వామి వివేకానంద ప్రవచనం జగద్విఖ్యాత. యువతకు స్పూర్తిగా చైతన్య దీప్తిగా భాసిల్లిన వివేకానంద స్వామి విలక్షణ జీవనశైలి, విశ్ర్ష్టమైన ఆయన సేవలు సింహావలోకనం చేసుకోవటం ఎంతైన అవసరము.

1863 జనవరి 12 న కలకత్తాలో విశ్వనాధ దత్తా, భువనేశ్వరి దంపతులకు వివేకానందుడు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు నరేంద్రుడు అని పేరు పెట్టారు. బాల్యం నుండి ఆయనలో ధైర్య సాహసాలు, నిరుపమాన దీక్షాశక్తి, అద్భుత ధారణ శక్తి ప్రస్పుటమయ్యాయి. కళాశాలలో చదువుతుండగా తండ్రి విశ్వనాధ దత్త మరణించటంతో కుటుంబ భారం ఆయనపై పడినది. మరో వైపు వైరగ్య భావాలు అంకురించాయి. చిన్నప్పటి నుంచి నరేంద్రుడి కలల్లో ఒక దివ్య శక్తి వెలుగు రూపంలో గోచరించేది. ఈ తరుణం లో దక్షిణేశ్వరంలో వున్న రామకృష్ణ పరమహంసతో పరిచయము ఏర్పడింది. తొలి సారి రామకృ ష్ణ పరమహంసను కలువగానే “ఏంత కాలమునకు వచ్చితివోయి? ఇంతకాలము నాపై నీకింత నిర్దాక్షిణ్యమేలనయ్యా?” ప్రపంచ ప్రజల తుచ్చ ప్రసంగాలతో నా చెవులు చిల్లులు పడుచున్నవి నాయనా! నీవు నరుడను సనాతన ఋషివి. ఇప్పుడు మానవ కోటి బాధలను రూపుమాపుటకై అవతరించిన నారాయణుడవు.” అంటూఆనందముతోఆలింగనము చేసుకున్నారు. అనతి కాలంలోనే నరేంద్రుడు రామకృష్ణుని ముఖ్య శిష్యుడైనాడు. ఆయన మనోహర గానమాధుర్యం రామకృష్ణుని ఆనందసాగరంలో ముంచెత్తేది. 1886 లో పరమహంస నిర్యాణం చెందినాక నరేంద్రుడు పరివ్రాజకుడుగా యావద్బారత పర్యాటన చేశారు. వివేకానంద నామము స్వీకరించారు. దేశ సముద్దరణకు, భారతజాతి పునర్జీవనానికి అహర్నిశలు తపించారు.

లైట్నింగ్ ఆరేటర్

స్వామి వివేకానంద గొప్ప ఉపన్యాసకుడు. ఆయన ప్రసంగం ఎంతటివారినైన అలరించేది. స్వామిని ఆ రోజులలో “లైట్నింగ్ ఆరేటర్” అని పిలిచేవారు. 1893 సెప్టెంబరు లో అమెరికాలోని చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసిన ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచదేశాలంతట ప్రతి ధ్వనిస్తుంది. ఈ సభలో హిందూ వేదాంత భేరిని మ్రోగించిన వివేకానంద ఇలా చెప్పారు. “ఎన్నటికైన విశ్వమానవ మతమనేది ఒకటి వెలసినది అంటే, అది తాను ప్రకటించిన భగవంతునిలా దేశకాలాతీతమై, అనంతమై ఉండాలి. కృష్ణుని అనుసరించే వారి మీద, సాధు పురుషుల మీద, పాపాత్ముల మీద అందరిమీద తదీయ భాను దీప్తి ప్రసరించాలి. అది బ్రాహ్మణ మతంగా కాని, మహమ్మదీయ మతంగా కాని ఉండక, వీటన్నింటిని తనలో ఇముడ్చుకొని ఇంకా వికాసం పొందటానికి అనంతమైన అవకాశం కల్గి ఉండాలి.

స్వామి వాక్పటిమకు అనంతమైన మేధా సంపత్తికి శ్రోతలు ముగ్దులయ్యారు. చికాగో నగర వీధులలో వివేకానందుని నిలువెత్తు చిత్రపటాలు వెలిశాయి. ఆయన మహోపన్యాసం హిందూ ఝం ఝూ మారుతమని ఆయన ఈశ్వర ప్రేరిత ప్రవక్త అని పత్రికలు శ్లాఘించాయి. నాలుగు సంవత్సరాల పాటు అమెరికా, ఐరోపా ఖండాలలో పర్యటించి, అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చి, వేదాంత కేంద్రాలు నెలకొల్పి, అనేకులను శిష్యులుగా స్వీకరించి 1897 లో స్వదేశానికి తిరిగి వచ్చినారు. దీనితో భారతదేశంలో నూతన శకం ప్రారంభమైనది. వెనువెంటనే స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించారు.

వివేకానందుడు గొప్ప దేశభక్తుడు. భారతదేశ ఘనతను వర్ణిస్తూ ఆయన ఇక్కడనే ఈ ఒక్క దేశంలోనే మానవ హృదయం అతి విశాలమై అనంత విస్తృతిని పొంది తోటి మానవ జాతినే కాక పశుపక్ష్యాదు లతో సహా సమస్త ప్రాణికోటి చేత సర్వజగత్తు ఉచ్చంనీచం లేకుండా తనతోనే వున్నట్లు భావన చెయగలిగింది అన్నారు. మనలోని లోపాలు వివరిస్తూ “మనంతట మనం పని చేయం, పనిచేసే వారిని పనిచేయనీయం . వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవ జాతిపతనానికి ముఖ్యమైనదీ లక్షణమే” అన్నారు. దైవ విశ్వాసం కంటె మానవ విశ్వాసం ముఖ్యమని బోధిస్తూ “మూడు వందల ముఫై కోట్ల దేవతలలోనూ నమ్మకమున్నా నీలో నీకే విశ్వాసం లేకపోతే నీకు ముక్తి లేదు. దేశ ప్రజలందరికి ఆత్మవిశ్వాసం క్రియా శూరత్వము కావాలి. ఈ అవసరము నాకు స్పస్టంగా కనిపిస్తుంది “అని నొక్కి చెప్పారు. అంతేకాక “మనం సోమరులము, ఏ పని చేయలేము ముందు మనమంతా సోమరితనాన్ని వదిలి కష్టించి పనిచెయటం అలవర్చుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది” అంటూ యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద.

“నా దేశంలో కుక్క పస్తుపడి ఉన్నదానికి ఆహారం పెట్టి రక్షించటమే నా పరమధర్మం. ఇదే నా మతం. తద్భిన్నమంతా ఆదర్శమే, కృత్రిమ ధర్మమే” అని నిరుపేదయైన నా భారత నారాయణుని – నా యిష్టదేవతలను అర్చించటానికై ఎన్ని జన్మలైనా ఎత్తగలను, ఎన్ని బాధలైన ఓరుస్తాను – అని ప్రకటించి అన్నదాన, విద్యాదాన, జ్ఞానదానాలచే ప్రజాసేవ చేస్తూ యావద్భారతంలోనే కాకుండా ప్రపంచమంతటా ప్రఖ్యాతి వహించిన శ్రీ రామకృష్ణ మఠసేవా సంఘాల్ని స్థాపించిన ఘనత వివేకానందుడికే దక్కుతుంది.

శ్రీ రామ కృష్ణ మఠసేవా సంస్థలు

లోక కళ్యాణం అను మహోద్యమాలకై స్వామి సేవా సంఘములను స్థాపించుట తలపెట్టేను. సేవా ధర్మ బీజమే కాలక్రమమున మహావృక్షమై 1909 సం|| లో శ్రీ రామకృష్ణ మఠములు, రామకృష్ణ సేవా సంస్థలు అను రెండు భాగములుగా పని చేయుచు శాఖోపశాఖలై విశ్వవ్యాప్తమై నేడు దేశముననే కాక ప్రపంచ సేవ కూడ చేయుచున్నవి.

గంగాతీరమున కలకత్తాకు 4 మైళ్ళ దూరములో బేలూరు అను నగరమున శ్రీ రామకృష్ణ సన్యాసి సంప్రదాయ కేంద్రముగా వివేకానంద స్వామి 1897 వ సం||లో స్థాపించిరి. ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యములు రామకృష్ణ పరమహంస ఆయన జీవిత వేదాంతాన్ని ప్రజలకు బోధించుటకు, వారి గ్రంధములు చదివించుటకు, కొందరికి శిక్షణ ఇచ్చి వారిచే ప్రజలకు బోధించుటకు ప్రజాసామాన్యమునకు విద్యావ్యాప్తి చేయుటకు, పాఠశాలలు, కళాశాలలు, అనాధ శజంఆలయములు, వికలాంగులకు, విద్యాబాధితులకు, ఆప్తులకు వసతి గృహములు, ఇతర ధర్మ కార్యములు ఒనర్చు సంస్థలు స్థాపించుటకు, ఈ లద్ష్యము సాధించుటకు పత్రికను, గ్రంధములు కరపత్రములు ముద్రించి ప్రజలకు అందజేయుటకు ఈ సంస్థలు పనిచేయుచున్నవి.

భారత దేశోద్దరణకై స్వామి తన ఉపన్యాస పర్యటనమున తెల్పిన ముఖ్య విషయములివి:

స్వామి వివేకానంద అమృత వాక్కులు నిత్యసత్యములు మనం గుర్తుంచుకోవలసిన విషయాలు: ప్రతి జీవి పరాత్పరుడే. ఈలోకంలో ఈ లోకంలో సత్సాంగత్యము కంటే పవిత్రమైనది మరి ఒకటి లేదు. స్వార్ధ చింతన లేనప్పుడే మనం ఘన కార్యములు సాధిస్తాం. మన ప్రభావం ఇతరులపై పడుతుంది. మతమంతా (ధర్మ) మనలోనే ఉంది. గ్రంధాలు గాని, గురువులు గాని, దాన్ని కనుగొనటానికి సహాయపడటం కన్నామజేమి చేయలేరు. వారు లేకపోయినా మనలోనే సత్యాన్ని దర్శించగలం. మతం (ధర్మం) వంటిది. ఇది అనేక తన్నులు తన్నినా లెక్క చేయవద్దు. అది చాలా పాలు ఇస్తుంది. భక్తి మార్గం సహజం, సంతోషదాయకం. మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకుని నీ జీవితాన్ని మలుచుకోవాలి.

హైదరాబాదులో రామకృష్ణ మఠము ఏర్పాటు చేసి సంస్కృత భాషలోనే కాకుండాపాశ్చాత్య భాషలు అనగా ఫ్రెంచి, జర్మన్, జపనీస్ మొదలగు భాషలలో ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు. పుస్థక విక్రయ కేంద్రము, ఆస్ప్రత్రి మొదలగు సంస్థలు ఈ సంస్థ అధ్వర్యములోనే నిర్వహించ బడుచున్నవి. కీసరగుట్టలో వృద్దుల వసతి కొరకు ఒక అశ్రమము నడపబడుచున్నది. రామకృషణ మఠము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమములులను గుర్తించి భారత ప్రభుత్వం ఉత్తమ సేవా సంస్థగా ఎంపిక చేసి, కోటి రూపాయలు నగదు బహుమతి ఇచ్చి సత్కరించినది. ఈ విధముగా మానవాళికి చైతన్యదీప్తిగా స్వామి వివేకానంద విశ్వవిఖ్యాతి పొందినాడు. నడపబడుచున్నది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>